Keerthi
నిరంతరం చదువులతో నిమగ్నమై, చాలా ఒత్తిడికి గురైన విద్యార్థులు సరదాగా స్నేహితులతో గడపాలని జలపాతంకు వెళ్లారు. అయితే అప్పటి దాకా ఎంతో సరదాగా స్నేహితులతో కలసి ఆడుకున్న విద్యార్థులకు భారీ వర్షం కురవడంతో ఊహించని ప్రమాదం ముంచు కొచ్చింది.
నిరంతరం చదువులతో నిమగ్నమై, చాలా ఒత్తిడికి గురైన విద్యార్థులు సరదాగా స్నేహితులతో గడపాలని జలపాతంకు వెళ్లారు. అయితే అప్పటి దాకా ఎంతో సరదాగా స్నేహితులతో కలసి ఆడుకున్న విద్యార్థులకు భారీ వర్షం కురవడంతో ఊహించని ప్రమాదం ముంచు కొచ్చింది.
Keerthi
జీవితంలో ఉన్నత స్థాయిలో నిలిచేందుకు చాలామంది విద్యర్థులు ఈ పోటీ ప్రంపంచంలో కుస్తీ పడుతుంటారు. ఈ క్రమంలోనే.. నిరంతరం చదువులతో నిమగ్నమై, చాలా ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి సమయంలో సరదాగా ప్రకృతి ఒడిలో స్నేహితులతో సేదా తీరాలని కోరుకుంటారు. దీంతో చాలా వరకు విద్యార్థులు జలపాతాలను సందర్శించడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలా మానసిక ప్రశాంతంతను కోరుకోవాలనుకునే జలపాతాలకు వద్దకు వెళ్లిన యువత ఆనందం.. క్షణాల్లోనే శాశ్వతంగా దూరమైపోయే ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ముగ్గురు స్నేహితులు సరదాగా కాసేపు జలపాతంలో ఆడుకోవాలనుకున్నారు. కానీ, ఊహించని విధంగా దారుణం చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
సరదాగా స్నేహితులతో గడపాలని జలపాతంకు వెళ్లిన ఓ ముగ్గురు విద్యార్థులు వరద తీవ్రత కారణంగా గల్లంతైయ్యారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ట్రావెలర్ వాహనంలో ఆదివారం మారేడుపల్లి పర్యాటక ప్రాంతానికి వచ్చారు. ఇక మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకున్న ఈ విద్యార్థులు సరదాగా అందులో దిగారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది,. దీంతో జలపాతం ఉధృతి పెరగడంతో ఓ అయిదుగురు విద్యర్థులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు.
అయితే ఆ ప్రవాహంలో గల్లంతైన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీహెచ్. హరదీప్ (20), విజయనగరానికి చెందిన కొసిరెడ్డి సౌమ్య (21), బాపట్లకు చెందిన బి. అమృత (21) ఉన్నారు. కాగా, వీరిని పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కొట్టుకుపోయిన వారిలో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరమ్మాయిలను ఒడిశా నుంచి విహారయాత్రకు వచచిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అందులో హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. ఇక విద్యార్థులు గల్తంతైన సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు.
ఇక ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వర్ష కాలంలో జలపాతల వద్దకు ఎవరు వెళ్లకూడదని, ఎందుకంటే ఆ సమయంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రలు, కాలేజీ యాజమాన్యం కూడా ఈ కాలంలో జలపాతల వద్దకు విద్యార్థులను తీసుకెళ్లకోడని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరి, అప్పటి దాకా సరదాగా స్నేహితులతో కలసి ఆడుకున్న విద్యార్థులు ఊహించని విధంగా గల్లంతైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.