iDreamPost
android-app
ios-app

జనసేన, TDP ఫస్ట్ లిస్ట్ రిలీజ్..పవన్ ను దెబ్బతీసిన చంద్రబాబు!

TDP,Janasena First List: శనివారం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇక ఈ జాబితాలో టీడీపీ తన పంతం నెగ్గించుకున్నట్లు స్పష్టమైంది. జనసేనకు పావలా వంతు కూడా టీడీపీ సీట్లను కేటాయించలేదు.

TDP,Janasena First List: శనివారం టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇక ఈ జాబితాలో టీడీపీ తన పంతం నెగ్గించుకున్నట్లు స్పష్టమైంది. జనసేనకు పావలా వంతు కూడా టీడీపీ సీట్లను కేటాయించలేదు.

జనసేన, TDP ఫస్ట్ లిస్ట్ రిలీజ్..పవన్ ను దెబ్బతీసిన చంద్రబాబు!

అందరూ ఎంతగానో ఎదురు చూసిన, ముఖ్యంగా  టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎదురు చూసిన  సమయం రానే వచ్చింది. పొత్తతో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అధికార వైఎస్సార్ సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన,టీడీపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో జనసేనకు చాలా తక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం 118 స్థానాల జాబితాను ప్రకటించగా.. కేవలం 24 స్థానాల్లో మాత్రమే జనసేనకు సీట్లు కేటాయించారు. అలానే 3 ఎంపీ స్థానాలు మాత్రమే జనసేనకు ఇచ్చారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రగా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

జనసేన,టీడీపీ పొత్తులో భాగంగా  తొలి అడుగు ముందుకు వేసింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ గెలుపును ఆపడమే అజెండాగా ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఈ ఉమ్మడి జాబిత విడుదల అవుతుందా అని అందరూ ఎందురూ చూశారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఎక్కువ సీట్లు ఊహించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాము కీలక పాత్ర పోషిస్తామని వారు భావించారు. 175 స్థానాలకు గాను కనీసం 50-60 సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే తాజాగా ప్రకటించిన జాబితాను చూసి వారందరూ షాకైనట్లు సమాచారం.

శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉమ్మడి జాబితాను ప్రకటించారు. ఫస్ట్ లిస్ట్ లో 118 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఇదే సమయంలో జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రకటనతో జనసేన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. అంతేకాక జనసేనకు కేటాయించిన స్థానాల సంఖ్యపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాకు ఇన్ని తక్కువ సీట్లా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా జనసేన నేతలు 50 నుంచి 60 సీట్లు ఆశించగా కేవలం 24 సీట్లకే పరిమితం చేయడంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 118 స్థానాలకు గాను 24 స్థానాలు జనసేనాకు కేటాయించగా..మిగిలిన 57 స్థానాల్లో మహా అయితే 10 నుంచి 15 ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలా చూసిన సరే జనసేనాకు 50 స్థానాలు మాత్రమే దక్కవు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా జనసేన నేతలు ఊహించిన స్థానాలు మాత్రం దక్కవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా తొలి జాబితాలో జనసేనాకు చాలా తక్కువ సీట్లే కేటాయించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఒకవేళ ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మాత్రం జనసేనకు ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు. మహా అయితే  మరో ఐదు సీట్లు మాత్రమే జనసేనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా  మొత్తంగా జనసేనాకు పావలావంతు కూడా టీడీపీ సీట్లు కేటాయించలేదు. 175 స్థానాలకు గాను 24 స్థానాలే కేటాయించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది.  తాజాగ ప్రకటనతో సీట్ల షేరింగ్ లో టీడీపీ పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తుంది. జనసేన లేకుండా టీడీపీ గెలవదని గతంలో పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో జనసేనకు పావలా వంతు కూడా చంద్రబాబు సీట్లు కేటాయించలేదు. మొత్తంగా టీడీపీ, జనసేన తొలి జాబితాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.