రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: మళ్లీ పట్టాలెక్కిన ఆ స్పెషల్ ట్రైన్ !

Janmabhoomi Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక ట్రైన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రైళ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. తాజాగా ఆ రైలు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

Janmabhoomi Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక ట్రైన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రైళ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. తాజాగా ఆ రైలు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

చాలా మంది ఎక్కువగా ట్రైన్ జర్నీ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలానే ఈ రైళ్లు నిత్యం ఎంతో మంది వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. మిగిలిన వాటితో పోలిస్తే.. ట్రైన్ టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. కాబట్టి..ఇందులో ప్రయాణించేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రయాణికుల స్పందన బట్టీ రైల్వే శాఖ అనేక సదుపాయాలను కల్పిస్తుంది. అనేక ప్రాంతాలకు రైళ్లను ఏర్పాటు చేస్తుంది. తాజాగా రైల్వే శాఖ ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్చ చెప్పంది. మరి..ఆ న్యూస్ ఏమిటో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక ట్రైన్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రైళ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కొన్ని రూట్లలో వెళ్లే ట్రైన్లు ఎప్పుడు చూసిన రద్దీగానే ఉంటాయి. అయితే వివిధ కారణాలతో డిమాండ్ ఉన్న ట్రైన్లను కూడా రద్దు చేస్తుంటారు. అలానే తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఓ ట్రైన్ కొంతకాలంగా నిలిచిపోయింది. తాజాగా ఆ రైలు విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైళ్లను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.  జూన్ 25నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది.

దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ డివిజన్ పరిధిలో ఆధునికీకరణ పనులు జరిగాయి. ఇక ఆ పనుల కారణంగా రద్దైన ముఖ్యమైన రైళ్లను తిరిగి ప్రారంభించింది. విశాఖపట్నం నుంచి లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైళ్లు 12805,2806 లు తిరిగి పట్టాలెక్కాయి. విజయవాడ నుంచి కాకినాడ పోర్ట్ కి వెళ్లే 17257 రైలు, చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ కి వెళ్లే 17643 రైలు ప్రయాణికులకు తిరిగి అందుబాటులోకి తెచ్చింది.  కొన్ని రోజుల క్రితం రైల్వే శాఖ రైళ్లు రద్దుకు సంబంధించి ప్రకటన చేసింది. నిడదవోలు – కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్ 23 నుంచి ఆగస్ట్ 11 వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

వీటిల్లో ముఖ్యమైన జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ ప్రెస్  వంటి సర్వీసులు ఉన్నాయి. అయితే ఈ ట్రైన్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు వాటిని పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను మరో 2  నెలలపాటు పొడిగించింది. హైదరాబాద్, నర్సాపూర్ మధ్య నడిచే 07631, 07632 రైళ్లను,, సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే 07482, 07481 రైళ్లను రైళ్లను మరో  రెండు నెలల పాటు పొడించారు. వీటితో పాటు మరికొన్ని ట్రైన్లను కూడా పట్టాలెక్కించారు. పూర్తి వివరాలకు రైల్వే వెబ్ సైట్ ను దర్శించండి.

Show comments