పెళ్లి కోసం దారుణం.. తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కొడుకులు

కొడుకుల పెళ్లి తండ్రికి శాపంగా మారింది. తమకు ఏజ్ బార్ అవుతున్నా ఇంకా పెళ్లి చేయడం లేదని తండ్రిపై దాడికిి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. వీరి దాడిలో తండ్రి కాళ్లు విరిగాయి.

కొడుకుల పెళ్లి తండ్రికి శాపంగా మారింది. తమకు ఏజ్ బార్ అవుతున్నా ఇంకా పెళ్లి చేయడం లేదని తండ్రిపై దాడికిి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. వీరి దాడిలో తండ్రి కాళ్లు విరిగాయి.

సాధారణంగా పిల్లలకు పెళ్లీడు రాగానే తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. కొడుకులు, కూతుర్లకు వివాహాలు జరిపించి బాధ్యత తీర్చుకోవాలని ఆలోచిస్తుంటారు. పిల్లలు అడగకముందే సరైన జోడిని వెతికి పెళ్లి జరిపిస్తుంటారు. మరికొంతమంది పిల్లల అభిప్రాయాలను తీసుకుని పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభిస్తారు. అయితే ఈ రోజుల్లో పెళ్లిల్లు చేయాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. అబ్బాయి అమ్మాయికి నచ్చక లేదా అమ్మాయి అబ్బాయి నచ్చక సంబంధాలు కుదరడం లేదు. ఒక వేళ ఇరువురు ఇష్టపడినా కాట్నకానుకల దగ్గర పెళ్లి సంబంధం కుదరడం లేదు. అబ్బాయికి జాబ్ లేకపోవడం, ఆస్తులు లేకపోవడం కూడా పెళ్లికాకపోవడానికి కారణమవుతున్నాయి.

పెళ్లి అనేది నూరేళ్ల బంధం కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. 30 ఏళ్లు దాటినా వివాహాలు జరగని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో పలువురు యువకులు తమకు ఇంకా పెళ్లి కావట్లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో తండ్రి తమకు పెళ్లి చేయట్లేదని ఇద్దరు కొడుకులు చితక్కొట్టారు. విచక్షణా రహితంగా దాడి చేసి కాళ్లు విరగ్గొట్టారు. కన్న తండ్రి అని చూడకుండా కర్కశంగా వ్యవహరించారు. వివాహం చేయలేదని ఏకంగా ఆ ఇద్దరు కుమారులు కలిసి, తండ్రినే చితకబాదారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లా గోనెంగండ్లకు చెందిన మంతరాజు, ఆదిలక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా, మిగతా ముగ్గురికి వివాహం కావలసి ఉంది. మంత రాజు స్థానికంగా కిరాణా షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా ఇద్దరు కుమారులు తమకు పెళ్లి చేయాలని తండ్రిని కోరారు. పెళ్లి సంబంధాలు చూడకుండా తండ్రి పట్టించుకోవడం లేదని తండ్రిపై కోపం పెంచుకున్నారు. 40 ఏళ్లు దాటినా వివాహం కాకపోవడంతో, ఇద్దరు కుమారులు తమ తండ్రిపై అక్కసు పెంచుకున్నారు. ఇదే విషయమై పలుమార్లు గొడవలు జరిగాయి. ఇక ఓపిక నశించిన కొడుకులు తండ్రిపై దాడికి పాల్పడ్డారు.

ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రిని బంధించి ఇద్దరు కుమారులు.. తమకు వివాహం జరిపించాలని విచక్షణారహితంగా కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో మంతరాజు కాళ్లు విరిగిపోయాయి. దెబ్బలు తాళలేక మంతరాజు కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి కుమారుల నుంచి విడిపించారు. ఆ తర్వాత బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కొడుకుల పెళ్లి గోల తండ్రి ప్రాణాలమీదికొచ్చినట్లైంది. పెళ్లి కోసం తండ్రిపై దాడి చేసిన వారికి సంబంధాలు ఎలా వస్తాయంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి పెళ్లి చేయట్లేదని తండ్రిని చితకబాదిన కొడుకుల వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments