iDreamPost
android-app
ios-app

గుండెలు పిండేసే ఘటన! అనాధ ఆశ్రమంలో తండ్రి.. కూతుళ్ళు ఏం చేశారంటే ?

  • Published Nov 19, 2024 | 5:14 PM Updated Updated Nov 19, 2024 | 5:14 PM

Viral: ఆరేళ్ళ తరువాత తప్పిపోయిన తన తండ్రిని చూసి షాక్ అయ్యారు ఆయన కూతుళ్ళు.. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

Viral: ఆరేళ్ళ తరువాత తప్పిపోయిన తన తండ్రిని చూసి షాక్ అయ్యారు ఆయన కూతుళ్ళు.. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

  • Published Nov 19, 2024 | 5:14 PMUpdated Nov 19, 2024 | 5:14 PM
గుండెలు పిండేసే ఘటన! అనాధ ఆశ్రమంలో తండ్రి.. కూతుళ్ళు ఏం చేశారంటే ?

నాన్న.. ప్రతి కుటుంబానికి కొండంత అండ. కొడుకు, కూతురికీ సూపర్ హీరో. ముఖ్యంగా అమ్మాయిలకు నాన్న అంటే నీడ లాంటి వాడు. తండ్రిలేని జీవితం నరకాయతన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి లేకపోతే ప్రతి బిడ్డకి ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది. తండ్రి తప్పిపోతే అదింకా నరకమే అని చెప్పాలి. ఇక ఆరు సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్నతండ్రి ఒక్కసారిగా అనాధాశ్రమంలో కనిపిస్తే ఆ బిడ్డలు ఎంత బాగోద్వేగానికి గురై ఉంటారో ఊహించండి? తాజాగా ఇక్కడ అలాంటి ఘటన బయట పడింది. ఇంతకీ ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.

బాలయ్య అనే ఓ వ్యక్తి ఆరేళ్ళ క్రితం మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయాడు. ఆయన తప్పిపోవడంతో ఆయన కూతుళ్ళు అల్లడిపోయారు. తండ్రి కోసం ఆ బిడ్డలు పరితపించారు. ఆయన కోసం వెతకని ప్రదేశం లేదు, వెళ్ళని చోటు లేదు. తండ్రి కోసం ఎన్ని చోట్ల వెతికినా కూడా ఆ కన్నబిడ్డలకు నిరాశే మిగిలింది. అలా ఆరేళ్ళు పాటు తండ్రి ఆచూకీ కోసం అలమటిస్తూనే ఉన్నారు. అలా కాలం గడిపేశారు. మొత్తానికి ఆ బిడ్డల బాధ చూసి దేవుడికి జాలి వేసిందేమో.. ఆ కన్నబిడ్డల మోర ఆలకించాడేమో.. ఆరేళ్ళ తరువాత ఆ తండ్రిని తన కూతుళ్ళ కంటపడేలా చేశాడు. బాలయ్య కూతుళ్లు మాతృదేవ అనాథాశ్రమంలో అన్నదానం జరిపించడానికి వెళ్లారు. అక్కడే తమ తండ్రి కనిపించాడు. తండ్రిని చూడగానే ఆ బిడ్డలకు ప్రాణం తల్లడిల్లిపోయింది. 130 మందిలో తమ తండ్రిని గుర్తుపట్టి పరుగెత్తుకుంటూ వెళ్లారు ఆ కూతుళ్లు. నాన్నను ఒక్కసారిగా చూసి ఇద్దరు కూతుళ్లు విపరీతంగా భావోద్వేగానికి గురయ్యారు. తమ తండ్రిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రికి ఆశ్రయం ఇచ్చిన ఆ ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత తమ తండ్రిని తమ ఇంటికి తీసుకువెళ్లారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో అందరి మనసుల్ని కలచివేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు తండ్రి పై ఆ బిడ్డలకు ఉన్న ప్రేమని చూసి ఆ దేవుడు కరిగిపోయి వీరిని కలిసేలా చేశాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ కన్నబిడ్డల భావోద్వేగం చూస్తుంటే.. ఇన్నాళ్లు తండ్రిని ఎంతలా మిస్ అయ్యారో అర్ధం అవుతుంది. అయితే ఆరేళ్ళ కింద బాలయ్య మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తప్పిపోయాడు. అక్కడ ఏకాకిగా తిరుగుతుండగా.. అతన్ని గమనించిన కొందరు.. మాతృదేవోభవ అనాధ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించారు. మరి ఈ ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş