P Venkatesh
ఎంగేజ్మెంట్ జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొన్నది. ఇరు కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిశ్చితార్థానికి రెడీ అవుతుండగా ఊహించని విషాదం వారిని వెంటాడింది. అసలు ఏం జరిగిందంటే?
ఎంగేజ్మెంట్ జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొన్నది. ఇరు కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిశ్చితార్థానికి రెడీ అవుతుండగా ఊహించని విషాదం వారిని వెంటాడింది. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
అనుకోకుండా జరిగే కొన్ని ఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతాయి. దేవుడా ఎందుకు ఇలా చేశావు అని గుండెలవిసేలా రోధించడం తప్పా చేసేదేముండదు. విధిరాతను ఎవరు తప్పించుకోలేరు. విధిని ఎవరూ మార్చలేరు. ఇదే తరహాలో జరిగిన ఓ విషాద ఘటన హృదయాలను కలిచివేస్తుంది. ఆ ఇంట్లో అప్పటి వరకు ఆనందం వెల్లువిరియగా ఆ ఒక్క ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. తమ కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కూతురికి పెళ్లి చేసి తమ బాధ్యతను తీర్చుకోవాలనుకున్నారు.
అత్తారింట్లో భర్త, పిల్లాపాపలతో తమ కూతురు ఆనందంగా గడుపుతుంటే మురిసిపోవాలనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. విధి వారి కుటుంబాన్ని వెంటాడింది. తెల్లారితే నిశ్చితార్ధం జరగాల్సి ఉండగా అంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. నవవధువు రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటరెడ్డిపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శ్రీరామిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని కష్టపడి చదివించారు. కూతుళ్లు గీతావాణి, బిందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా ఉద్యోగాలు చేస్తున్నారు.
కుమారుడు నారాయణ రెడ్డి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు గీతావాణికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో కూతురు ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తాడిపత్రిలోని నంద్యాల రోడ్డులో ఉన్న ఎస్ఎల్‌వీ ఫంక్షన్ హాలులో ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వస్తువులను తీసుకొచ్చేందుకు వధువు గీతావాణి తన తమ్ముడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రి వెళ్లారు. అక్కడ కావాల్సిన వస్తువులు తీసుకుని రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి సొంత ఊరికి పయనమయ్యారు. ఇక్కడే వారిని రోడ్డు ప్రమాదం వెంటాడింది. బైక్ పై వస్తున్న వారు రోడ్డు దాటుతుండగా నాపరాయి బండల లోడుతో తాడిపత్రికి వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ గీతావాణిపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తమ్ముడు నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడి స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. తెల్లారితే ఎంగేజ్మెంట్ జరగనుండగా యువతిని మృత్యువు కబలించుకుపోవడంతో పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొన్నది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లి ముచ్చట తీరకుండానే నవ వధువు మృత్యుఒడిలోకి చేరడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. నిశ్చితార్ధానికి ముందే ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.