iDreamPost
android-app
ios-app

పొగ మంచు ఎఫెక్ట్: విజయవాడ హైవేపై నిలిచిన వాహనాలు!

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ఏపీలో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. ఉదయం పొగమంచు వాహనదారులను ఇబ్బంది పెడుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ఏపీలో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. ఉదయం పొగమంచు వాహనదారులను ఇబ్బంది పెడుతోంది.

పొగ మంచు ఎఫెక్ట్: విజయవాడ హైవేపై నిలిచిన వాహనాలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అదిలాబాద్, అరకు వంటి ప్రాంతాల్లో చలి పంజా విసుతుంది.  కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9 అయిన బయటకు వచ్చేందుకు ప్రజలకు భయంతో వణికిపోతున్నారు. డిసెంబర్ చివర్లోనే ఈ స్థాయిలో చలి తీవ్రత ఉంటే.. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎలా ఉంటుందో ఊహించుకోలేము. ఇక పొగమంచు కారణంగా ప్రజలు, వాహన దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక మరికొన్ని ప్రాంతాల్లో ఈ పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ హైవేపై పొగమంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఏపీ, తెలంగాణంలో పులి పంజా విసురుతోంది. గత రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి  తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది. దీంతో ఉదయాన్నే జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు. అంతేకాక ఈ పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి.. పలువురు మృతి చెందారు కూడా. తాజాగా పొగ మంచు కారణంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ హైవేపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద భారీగా పొగమంచు కారణంగా బైకులు, కార్లు, ఇతర వాహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

చెన్నై-కలకత్తా హైవేపై కూడా కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. సమయం 9,10 గంటలు అవుతున్నా పొగ మంచు వీడటం లేదు. దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో కూడా చల్లిపంజా విసురుతుంది. దీంతో ఉదయాన్నే ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసం చేయడం లేదు.  అలానే కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ , రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లితో పాటు పలు చోట్ల అత్యుల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇలా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన్యం ప్రాంతాలు గజగజ వణుకుతోన్నాయి. అయితే పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవలే తిరుమల తిరుపతిని కూడా మంచు కప్పేసింది. చాలా సమయం పాటు తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం పొగమంచుతో కప్పివేయబడింది. శ్రీవారి ఆలయ గోపురం అయితే పూర్తి స్థాయిలో కనిపించకుండా పొగ మంచుతో నిండిపోయింది.  అలా చాలా సమయం పాటు తిరుమల కొండపై పొగ మంచు తీవ్ర ప్రభావం చూపింది.  ఈ అరుదైన దృశ్యాన్ని చూసి.. భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక  ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా అదే పొగ మంచు కారణంగా విజయవాడ, హైదరాబాద్ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి.