పిఠాపురంలో TDPకి అసమ్మతి సెగ.. పవన్ గో బ్యాక్ అంటూ!

పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇలా ఆయన ప్రకటించారో లేదో..పిఠాపురంలో అసమ్మతి సెగలు ఉవ్వెత్తునా ఎగసి పడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇలా ఆయన ప్రకటించారో లేదో..పిఠాపురంలో అసమ్మతి సెగలు ఉవ్వెత్తునా ఎగసి పడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో అసమ్మత్తి సెగలు రేగుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశారు. జాబితాలో పేర్లు లేని కీలక నేతలు.. తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ చేసి ఓ ప్రకటన చేసిన..ఓ ప్రాంతంలో టీడీపీకి అసమ్మతి సెగ రేపుతోంది. టీడీపీ జెండాలు తగలపెడుతూ..పేపర్లు చించేస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గురువారం జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఇలా పవన్ ప్రకటన చేయడంతో వెంటనే పిఠాపురంలో అసమ్మతి జ్వాలలు ఎగిశాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వర్మను మోసం చేసిందని ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. వర్మకు టికెట్ ఇవ్వాలని లేకుంటే.. టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన అనుచరులు అల్టిమేటం ఇచ్చారు.

పిఠాపురంలో పవన్ పోటీ చేస్తాననడంతో వర్మ అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మకూ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. వర్మ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయగా, మరికొందరు పవన్ గో బ్యాంక్ అంటూ నినాదాలు చేశారు. మొత్తంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగను రేపింది. ఇలా పిఠాపురంలో టీడీపీ అసమ్మతి సెగ తీవ్ర స్థాయిలో  చేరింది. వర్మ అనుచురులు రోడ్లపైకి చేరి.. టీడీపీకి సంబంధించిన పేపర్లు, జెండాలు  మంటల్లో వేస్తూ… పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పిఠాపురంలో టీడీపీ అసమ్మతి తీవ్రత చూశాక పవన్ కల్యాణ్ గెలుపు కష్టమేనని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కి వ్యత్తిరేకంగా టీడీపీ నేతలు పరోక్ష నిరసనలు తెలియజేయడంపై జనసేన కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం తమ నాయకుడు ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వ్యక్తి పోటీ చేస్తానంటే.. ఇంతలా నిరసనలు తెలియజేస్తారా అంటూ జనసైనికులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

Show comments