iDreamPost
android-app
ios-app

పవన్ కి జగన్ భయం.. ఒక్కసారి గెలవాలన్న ఆశలో లెక్క తప్పాడు!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి సీఎం జగన్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు ఉంది. ఈ సారి కూడా జగన్ తనను అసెంబ్లీ గేటు తాగనివ్వడేమో అనే భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి సీఎం జగన్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు ఉంది. ఈ సారి కూడా జగన్ తనను అసెంబ్లీ గేటు తాగనివ్వడేమో అనే భయంతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

పవన్ కి జగన్ భయం.. ఒక్కసారి గెలవాలన్న ఆశలో లెక్క తప్పాడు!

రాజకీయం అనే చదరంగం ఆడటం అంటే అంత ఆషామాషీ కాదు. ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అనేది పసిగడుతూ అడుగులు ముందుకు వేయాలి. లేకుంటే.. మొత్తం రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రత్యర్థులు ఎన్నో వ్యూహాలు పన్నినా, ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. పసిగట్టి దానికి సరైన ప్రతిస్పందన ఇచ్చేవారే రాజకీయాల్లో నిలదొక్కుంటారు. అలా లేనివారు ఓటమి భయంతో నోటికి ఏది వస్తే.. అది మాట్లాడుతూ.. ప్రజల్లో నవ్వుల పాలవుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ పరిస్థితి అలానే ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న పవన్ స్పీచ్ చూసిన వాళ్లు.. ఆయనకు జగన్ భయం పట్టుకుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీని స్థాపించి.. దాదాపు పదేళ్ల పైనే అయింది. అయినా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోలేదు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక విచిత్ర వ్యూహంతో వచ్చి.. తీవ్ర అభాసు పాలవుతున్నారు జనసేన నాయకుడు. 2014లో టీడీపీకి మద్దతు ఇవ్వగా, 2019లో ఒంటరిగా పోటీ చేశారు, 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీతో కలిసి పోటీ చేయనున్నారు. ఇలా చిత్ర విచిత్రంగా ఆయన ప్రవర్తించడానికి కారణం సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న భయమేననే టాక్ వినిపిస్తోంది.  2019లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే రెండు చోట్ల కూడా పవన్ కి పరాభవం తప్పలేదు. 2019 ఎన్నికల్లో జగన్ సునామీలో పవన్ కూడా కొట్టుకుపోయారు.

ఆ సమయంలో జగన్ ఇచ్చిన షాక్ నుంచి పవన్ కల్యాణ్ ఇప్పటికీ కోలుకోనట్లే కనిపిస్తోంది. అందుకే ఈ సారి కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాల్లో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. అందుకే  ఇటీవల ప్రకటించిన జాబితాలో ఆయన తన పేరును ప్రకటించలేదు. ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను ప్రకటించింది. అందులో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ , బాలకృష్ణల స్థానాలను ప్రకటించారు. అలానే నాదెండ్ల మనోహర్ కూడా తన స్థానం ఏంటనేది స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ  ప్రకటనలో కీలకమైన నేత పవన్ కళ్యాణ్ పేరు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందరూ ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించారు. జాబితాలో ఆ స్థానంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాలేదు.

ఇరుపార్టీల మాములు నేతల మాదిరి  పవన్ కల్యాణ్ పేరు కూడా తొలి జాబితాలో కనిపించలేదు. జగన్ వ్యూహాలకు మరోసారి భీమవరంలో ఓడిపోతాననే భయంతోనే తన పేరును ప్రకటించలేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ కీలక నేతలతో పాటు పవన్ ను ఓడించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. తనను జగన్ ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారనే భయం పవన్ లో పట్టుకుందని, బుధవారం జరిగిన కూటమి సభలో ఆయన ప్రసంగమే నిదర్శనమనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పదేళ్లుగా పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ భయంతో లెక్కలు తప్పి.. మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.