iDreamPost
android-app
ios-app

Narendra Modi: CM జగన్ పై చంద్రబాబు అస్త్రాన్ని ఫెయిల్ చేసిన మోదీ!

ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరి పేట ఈ సభకు వేదికైంది. ఈ సభలో ప్రధాని మోదీ చేసే ప్రసంగంపై అందరు ఎంతో ఆసక్తిగా చూశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అయితే వారి ఆశలను మోదీ అడియాశలు చేశారు.

ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి బహిరంగ సభ జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరి పేట ఈ సభకు వేదికైంది. ఈ సభలో ప్రధాని మోదీ చేసే ప్రసంగంపై అందరు ఎంతో ఆసక్తిగా చూశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అయితే వారి ఆశలను మోదీ అడియాశలు చేశారు.

Narendra Modi: CM జగన్ పై చంద్రబాబు అస్త్రాన్ని ఫెయిల్ చేసిన మోదీ!

శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మాములుగానే చాలా వేడిగా ఉండే ఏపీ రాజకీయం మరింత హీట్ ఎక్కింది. ముఖ్యంగా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగారు. అలానే జగన్ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమికి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు. ఈ సభపై, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ పై చంద్రబాబు వేయాలనుకు అస్త్రాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది.

ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా సభ జరిగింది. ఈ కూటమి ఏర్పడిన తరువాత జరిగిన తొలి సభ ఇదే. ప్రజాగళం పేరుతో ఈ సభను కూటమి నిర్వహించింది. ఇక ఈ సభలో ప్రధాని ప్రసంగంపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూశాయి. ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఈ సభ ద్వారా జగన్ పై విమర్శలు సంధించాలని భావించారు. అలానే ప్రధాని మోదీ కూడా  సీఎం జగన్ పై విమర్శలు చేస్తారని భావించారు. అలా మోదీ.. సీఎం జగన్ పై విమర్శలు చేస్తే.. అదే అస్త్రాంగా వాడుకుని ప్రజల్లోకి వెళ్లారని చంద్రబాబు భావించారని టాక్. అయితే చంద్రబాబు ఆశలను, అస్త్రాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారు.

ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అంతా చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాలకు భిన్నంగా సాగింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు. అసలు టీడీపీ, జనసేన అనే పేర్లు ప్రధాని మోదీ నోట వినిపించలేదు. జగన్ ను టార్గెట్ చేసినట్లు కనిపించ లేదు. అలానే ఏపీకి సంబంధించిన ఏ అంశం పైనా కూడా మోదీ హామీ ఇవ్వలేదు. అమరావతి రాజధాని, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల ఊసే ఎత్తలేదు. కేవలం ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని అనే మాటను మాత్రం ప్రధాని చెప్పారు. ఇలా చంద్రబాబు..ప్రధాని మోదీ చేసే విమర్శలను అస్త్రాంగా వాడుకోవాలని భావించారు.

Modi speech

గతంలో షర్మిల తన సీఎం జగన్ తో విభేదించిన సమయం నుంచి చంద్రబాబు ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు. అలానే వైఎస్ వివేకా హత్య కేసులో పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.  ఇలా సొంత చెల్లిని, తల్లిని జగన్ పట్టించుకోవటం లేదని చంద్రబాబు, పవన్ ఆరోపించారు. షర్మిల చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డామేజ్ అవుతారని చంద్రబాబు భావించారని టాక్. అదే విధంగా ప్రధాని మోదీ..సీఎం జగన్ గురించి ఏమైనా మాట్లాడితే.. వాటిని అస్త్రాలుగా వాడుకోవాలని బాబు భావించారు. అయితే చంద్రబాబు, పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని మోదీ  ప్రసంగించారు. ఈ అంశంలో మోదీ, చంద్రబాబు, పవన్ మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టం అవుతోంది. ఒక విధంగా సీఎం జగన్ పైన చంద్రబాబు పోరాటంలో ఒక అస్త్రం మిస్ అయినట్లేననే పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.