బాబు ఫైబర్ గ్రిడ్ ఛీటింగ్ కి జనమే సాక్ష్యం: జర్నలిస్ట్ సాయి

ప్రస్తుతం ఏపీ రాజకీయం చాలా హాట్ హాట్ గా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే స్కీల్ డెవల్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైలులో రామాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది.  ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన మరికొన్ని కుంభకోణాలను సీఐడీ అధికారులు బయట పెట్టారు. వాటిల్లో ప్రధానమైనవి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం. ఈ రెండిటి ద్వారా భారీగా చంద్రబాబు, లోకేశ్ ఇతర నేతలు దోచుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పైబర్ గ్రిడ్ స్కాం కి ప్రజల సాక్ష్యం అంటూ సీనియర్ జర్నలిస్ట్ సాయి కీలక విషయాలను వెల్లడించారు.

ఫైబర్ గ్రిడ్ లో ఏ కుంభకోణం జరగలేదని, దానికి సాక్ష్యం ప్రజలనేనని కొందరు టీడీపీ నేతలు బలంగా చెబుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ గ్రిడ్ లో ఏ కుంభకోణం జరగలేదనేది పచ్చి అబద్ధమని సాయి అన్నారు. ఆ మాటలు నిజమే అని చెబుతూ పలు కీలక వివరాలు తెలిపారు. ఫైలెట్ ప్రాజెక్ట్ కింద్ కేంద్ర ప్రభుత్వం ఏపీ కి ఇచ్చిన అరుదైన వరం ఫైబర్ గ్రిడ్. దీని ద్వారా రాష్ట్రంలోనే ప్రజలందరికి కేవలం రూ.149కే కేబుల్, ఇంటర్ నెట్ కనెక్షన్ల సౌకర్యం కల్పించాల్సి ఉంది.

అయితే టీడీపీ ప్రభుత్వం ఈ ఫైబర్ గ్రిడ్ లో భారీ కుంభకోణంకి పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అంతేకాక కేబుల్ ఆపరేటర్లను, నెట్ వర్క్ యాజమాన్యాన్ని బెదిరించి…వారి కనెక్షన్ల కూడా పైబర్ గ్రిడ్ ఖాతాలో వేశారంటూ సాయి తెలిపారు. అలా వారికి వచ్చే డబ్బులను లాక్కుని, అదొక దోపిడి చేశారని, ఆ విధంగా దాదాపు నాలుగేళ్ల పాటు నడిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం అటు ప్రజలు నష్టపోయారు, ఇటు కేబుల్ ఆపరేటర్లు నష్టపోయారని ఆయన ఆరోపిస్తున్నారు. కేబుల్ వాళ్లకే ఈ పనులు అప్పగిస్తే.. చాలా ఖర్చు తగ్గేదని, తమ జేబులు నింపుకునేందుకు కొత్త వారికి అప్పగించి భారీగా దొచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాదాపు 1.60 కోట్ల కుటుంబాలకు గాను కేవలం 10 లక్షల మందికి ఇచ్చారని సాయి అన్నారు.

అందులోనూ ఈ ఫైబర్ గ్రిడ్ పేదలకు ఇవ్వాలని రూల్ కూడా లేదు. ఇలాంటి సమయంలో కేవలం 10 లక్షల మందికే ఇవ్వడం అనేది పెద్ద స్కామని సాయి అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఇలా మిగిలిన లక్షల మంది కుటుంబాలకు ఈ ఇంటర్ నెట్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో వారు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి.. కేబుల్, ఇంటర్ నెట్ కొనాల్సిన అవసరం వస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి ఈ వివరాల ద్వారా ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణం జరిగిందనటానికి జనమే సాక్ష్యమని సాయి.. తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి..  సినీయర్ జర్నలిస్ట్  సాయి  చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments