iDreamPost

బాబు బయటకు రావడం కష్టం! జర్నలిస్ట్ సాయి విశ్లేషణ

బాబు బయటకు రావడం కష్టం! జర్నలిస్ట్ సాయి విశ్లేషణ

ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అరెస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయంగా మారింది. అందుకు కారణంగా ఈ కేసుకు సంబంధించిన ఓ పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలను క్వాష్ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు కోసం దేశమంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. ఇక టీడీపీ శ్రేణుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాబు ఎప్పుడు బయటకి వస్తాడా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి చెందిన వారే..కీలక విషయాలను వెల్లడించారని టాక్. అందులోని ప్రధాన సారాశం బాబు బయటకు రావడం కష్టమే. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సాయి స్పష్టంగా వివరించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసకుందాం..

టీడీపీ పార్టీలో మాస్, క్లాస్ అనే రెండు వర్గాలు ఉన్నాయని, ఈ క్లాస్ బ్యాచ్  నుంచి సాఫ్ట్ వేర్లు “బ్రింగ్ బ్యాక్ బాబు“అనే నినాదాలు తీసుకొచ్చారని సాయి తెలిపారు.  అలాంటి క్లాస్ బ్యాచ్ కి  చెందిన నిలాయపాలెం విజయ్ కుమార్ చెప్పాడంటూ కొన్ని విషయాలను వెల్లడించారు. టీడీపీ శ్రేణులు ఆవేశ పడకుండా, ఆలోచించాల్సిన సమయం ఇదని తెలిపారు. బాబు గారి పిటిషన్  క్వాష్  చేస్తారా?. టీడీపీ వారికి అర్థమయ్యేలా.. వాళ్ల సదరు వ్యక్తి చెప్తున్న మాటే ఇదని సాయి అన్నారు. ఇంకా సాయి మాట్లాడుతూ..” సుప్రీంకోర్టు 3 తేదీకి వాయిదా వేసింది. ఆరోజు బాబు గారి పిటిషన్ క్వాష్ కాకపోవచ్చు. ఈ కేసు క్వాష్ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం చంద్రబాబు పరంగానే కాకుండా దేశ వ్యాప్తంగా పలు కేసుల మీద ఈ కేసు తీర్పు ప్రభావం చూపెడుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై ఇచ్చే తీర్పు భవిష్యత్ కేసులకు ఓ కేస్ స్టడీగా మారుతుంది.

ఈ క్రమంలోనే హైకోర్టులో మాదిరి ఆ కేసుపైనే సుప్రీ కోర్టు తీర్పు ఇవ్వడానికి అవకాశం లేదు. అలా కేవలం 17ఏ సవరణపై మాత్రమే తీర్పు ఇచ్చి..సందిగ్ధం పడేయరు. 2018 తరువాత కేసులో 409 సెక్షన్ పెట్టాలంటే ఆ వ్యక్తిపై వారి అనుమతి కావాలనిస్పష్టంగా తీర్పు ఉంది. ఇదే ప్రధాన న్యాయమూర్తి ద్వారా  2018 తరువాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన.. అంతకు ముందుకు ఆ కేసులో ఏదైనా ఇంటర్ ఇప్పటి వ్యక్తికి సంబంధం  ఉన్న లేకపోయినా సుప్రీం కోర్టు ఇచ్చిన 17 ఏ సవరణ చెల్లుతుంది లేదా చెల్లదు అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టం చేసి తీరాలి” అంటూ సాయిగా చెప్పుకొచ్చారు. మరి.. ఈ వివరణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి