iDreamPost
android-app
ios-app

Pawan Kalyan: జగన్ దెబ్బకు.. భీమవరం నుంచి పవన్ పరార్..!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదు. అక్కడి నుంచి పిఠాపురానికి ఫిష్ట్ అయ్యారు. గురువారం మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ కల్యాణే స్వయంగా చెప్పారు. అయితే సీఎం జగన్ దెబ్బకే భీమవరం నుంచి పరారైనట్లు టాక్ వినిపిస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయడం లేదు. అక్కడి నుంచి పిఠాపురానికి ఫిష్ట్ అయ్యారు. గురువారం మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ కల్యాణే స్వయంగా చెప్పారు. అయితే సీఎం జగన్ దెబ్బకే భీమవరం నుంచి పరారైనట్లు టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan: జగన్ దెబ్బకు.. భీమవరం నుంచి పవన్ పరార్..!

ఏపీ రాజకీయాల్లో అర్థంకాని పార్టీ, అధినేత ఎవరైనా ఉన్నారంటే.. అది పవన్ కల్యాణ్ ఒక్కరే అనే చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. కారణం..పొలిటికల్ గా ఆయన చెప్పే మాటలు, చేసే పనులు చాలా భిన్నంగా ఉంటాయి. ఒక సభలో చెప్పిన మాటకు, మరో సభలో చెప్పిన మాటకు పొంతన ఉండదు. ముఖ్యంగా తాను యుద్ధం చేస్తున్నాను అంటారు.. చివరకు సీఎం జగన్ తో పోరాడాలంటే.. నా ఒక్కడి వల్ల కాదు అంటారు.. ఇలా తరచూ అనేక రకాల మాటలతో సామాన్య ప్రజలతో పాటు జనసేన శ్రేణులను కూడా అయోమాయనికి గురి చేస్తుంటారు.

పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే  ఉత్కంఠకు తెరపడింది. తాను తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.  అయితే ఇప్పటి వరకు ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. తాను ఓడిపోయిన చోటే గెలిచి చూపిస్తానని గతంలో ఆయన సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన మరోసారి కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. అందుకు తగ్గట్లే మంగళవారం జరిగిన జనసేన పార్టీ సభలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్ ను గూండా అంటూ సంబోధిస్తూ అనేక ఆరోపణలు చేశారు.

భీమవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు చూసి.. మరోసారి అక్కడి నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని భావించారు. కానీ.. అక్కడ సీఎం జగన్ వేసిన ప్లాన్, వ్యూహాలకు పవన్ కల్యాణ్ పరారైనట్లు టాక్ వినిపిస్తోంది. మరోసారి అక్కడ ఓడిపోతే..పరువు పోతుందనే భయంలో భీమవరం నుంచి పిఠాపురంకి షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీఎం జగన్ టార్గెట్ చేసి వారిలో పవన్ కల్యాణ్ ఒకరు. అందుకే భీమవరంలో గ్రంధీ శ్రీనివాస్ బలంతో పాటు పార్టీ బలంగా ఉండేలా సీఎం జగన్ వ్యూహాలు రచించారు. అక్కడ అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. దీంతో ఆ నియోజవర్గంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉందని సర్వేల్లో తేలింది. దీంతో భీమవరంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకున్న పవన్..మరోసారి పోటీ చేసి ఓడిపోతే.. పరువుపోతుందనే భయంతో..కొత్త నియోజవర్గానికి వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Pawan kalyan out from bhimavaram

భీమవరం నుంచి పులివర్తి రామాంజనేయులను జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన రెండు రోజుల క్రితమే టీడీపీ నుంచి జనసేనలో చేరారు. అలా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పని చేసిన వారిని వదిలేసి.. ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చే వారికి టిక్కెట్లు ఇవ్వడంపై కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన ఓటమి కాకుండా..తన పార్టీ వాళ్లను నిలబెడితే ఓడిపోతారనే భయంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బరిలో నిలుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.  మొత్తంగా సీఎం  జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు ఓటమి భయంతో పవన్ కల్యాణ్ నియోజవర్గాన్నే మార్చుకున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో జరుగుతోంది.  పిఠాపురంలో కూడా పవన్ కల్యాణ్ కి గెలుపు కష్టమేననే వార్తలు వినిపిస్తోన్నాయి.