Arjun Suravaram
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయాని చూసి ప్రజల నవ్వుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలకు, వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా తనపై దాడి చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయాని చూసి ప్రజల నవ్వుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలకు, వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా తనపై దాడి చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Arjun Suravaram
ఏపీలో రాజకీయాలు వేసవిలో ఎండలను మించి సాగుతోన్నాయి. ఇక్కడి పొలిటికల్ హీట్ ముందు సమ్మర్ హీట్ కూడా సరిపోవడం లేదు. ఏపీలోని ఏ గల్లీ చూసిన రాజకీయ సభలతో హాట్ హాట్ గా ఉన్నాయి. ఇక అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో ఉంది. ఏపీలో పొలిటికల్ పరిస్థితి కాసేపు పక్కన పెడితే..పవన్ చేసే రాజకీయంపై అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన చేస్తున్న ఆరోపణలకు, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనను విమర్శల పాలు చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో మూడు రోజుల క్రితం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను అధికార వైసీపీ టార్గెట్ చేస్తోంది, కావాలని తనపై దాడులు చేయిస్తోంది అనేలా సంచలన కామెంట్స్ చేశారు. తనను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయని, వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి, తనపై , సెక్యూరిటీ వాళ్లపై దాడి చేస్తున్నారని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నుంచి తనకు త్రెట్ ఉంది అనేలా పవన్ మాట్లాడుతున్నారు.
అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో తిరగడం రాక, ప్రచారం చేసే ఓపిక లేక.. ఇలాంటి అసత్యపు మాటలు మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అయినా కుంటి సాకులు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తున్నారనే మాటలు వినిపిస్తోన్నాయి. నిజంగా ఎవరైనా బ్లేడ్ తో దాడి చేసినట్లు అయితే..గాయాలు ఉండాలి కదా అనే ప్రశ్నలు వినిపిస్తోన్నాయి. పెద్దగా కాకపోయినా బ్లేడ్ తగిలేత చిన్నపాటి గాయం, గీత అయినా కనిపిస్తుంది కదా అంటూ పలువురు పవన్ ను ప్రశ్నిస్తున్నారు. నిజంగా బ్లేడ్ దాడి జరిగి ఉంటే.. కామెంట్సే చేసే బదులు ఆ ఫోటోలే పెడితే సరిపోయేది కదా అనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఆయన కేవలం అధికార వైసీపీ ఎదుర్కొనే ధైర్యం లేక.. ప్రజల నుంచి ఈ విధంగానైనా సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
ఇలా అసత్యపు మాటలతో ప్రజలను మోసగించాలనుకోవడం ఇదేనా నీ రాజకీయం పవన్ అంటూ పలువురు విమర్శిస్తున్నారు. అలానే తన పార్టీ నుంచి నిలబెట్టేందుకు అభ్యర్థులు లేక.. టీడీపీ వ్యక్తులను తన పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇస్తున్నారని సొంతపార్టీనేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేసిన వారిని కాదని ఇతర పార్టీ ల నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏంటని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా పవన్ కల్యాణ్ చేసే రాజకీయం వల్ల అటు ప్రజల్లోను, ఇటు తన తనను నమ్ముకు వారికి ఎలాంటి ప్రయోజనం లేదనే టాక్ వినిపిస్తోంది. కేవలం చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఇంతలా కష్టపడుతున్నారనే.. అందులో భాగమే బ్లేడ్ డ్రామా అని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.