విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!

ఉన్నత విద్యనభ్యసిస్తే.. మంచి ఉద్యోగవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఏపీలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించింది.

ఉన్నత విద్యనభ్యసిస్తే.. మంచి ఉద్యోగవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఏపీలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించింది.

సమాజంలో మంచి పొజీషన్ లో ఉండాలంటే.. ఉన్నత విద్య ఎంతో అవసరం. తమ పిల్లలను సొసైటీలో గౌరవమైన స్థానంలో చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. తమ స్థాయికి మించినప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తుంటారు.  ఏపీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ ఎడ్యూకేషన్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  విద్యార్థులకు ఉన్నత విద్యనందించే దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు.  చిన్నతనం నుంచే విద్యార్ధులకు ఆంగ్లంపై పట్టు సాధించి ఉన్న విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

మంచి చదువు ఉన్నప్పటికీ.. పేదరికంలో ఉండి విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు గొప్ప సువర్ణావకాశం కల్పిస్తుంది జగన్ సర్కార్. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’ తో ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నుంచి సీఎం జగన్ ఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కొరకు లేటెస్ట్ టెక్నాలజీ, టీచింగ్ మెథడ్స్ రూపొందించారు. ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఇంపిరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, కొలంబియా, న్యూయార్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఫైనాన్స్ ఇలా ఎన్నో గొప్ప వర్సిటీల నుంచి సీనియర్ ఫ్యాకల్టీస్ తో కోచింగ్ ఉంటుంది.. అలాగే విద్యార్థులకు సర్టిఫికేషన్లు కూడా పొందవొచ్చు. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ఉద్యోగావకాశాలకు పొందడానికి మంచి అవకాశం.

ఇక ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం వల్ల విద్యార్థులకు తమకు నచ్చినటువంటి వర్టికల్స్ చదువుకునేలా ప్రణాళికను ఏర్పాటు చేశారు. విదేశాలకు వెళ్లి అక్కడ మంచి కాలేజ్ లో ఉన్నత విద్యనభ్యసించలేని విద్యార్థులకు ఇదో గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పొచ్చు. ఎడెక్స్ కోర్సులకు ఇంటర్ నేషనల్ వర్సిటీలే ఆన్ లైన్ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్స్ అందజేస్తాయి. ఆ క్రెడిట్స్ మన కరిక్యూలమ్ లో భాగం అవుతాయి. దీని ద్వారా ఏపీ విద్యార్థులు గొప్ప చదువులు చదవడమే కాదు.. గ్లోబల్ స్టూడెంట్స్ గా సర్టిఫై అవుతారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలో నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments