iDreamPost

AP విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

  • Published May 20, 2024 | 10:39 AMUpdated May 20, 2024 | 10:39 AM

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 10లో ఐదుగురు విద్యార్థులు ఏపీకి చెందిన వారు ఉండడం విశేషం. కాగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 10లో ఐదుగురు విద్యార్థులు ఏపీకి చెందిన వారు ఉండడం విశేషం. కాగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

  • Published May 20, 2024 | 10:39 AMUpdated May 20, 2024 | 10:39 AM
AP విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాల్లో ఆంధ్రా విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. స్టేట్ టాపర్ గా అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన ప్రణీత టాప్ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. టాప్ 10లో ఏపీ విద్యార్థులు ఐదుగురు ఉండడం విశేషం. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ విద్యార్థులు ఈసారికి చేరవచ్చునని తెలిపింది. 2024-25 విద్యాసంవత్సరానికి పాత విధానమే వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.  తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరంలో (2024-25) ఇంజనీరింగ్ సహా వివిధ ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశాలు గతంలో మాదిరిగానే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.

దీంతో ఏపీ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలో 15 శాతం నాన్ లోకల్ సీట్లను పోటీ పడి దక్కించుకోవచ్చు. ఎప్ సెట్ ఫలితాల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 2 లోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వెలువరించడంతో ఏపీకి చెందిన విద్యార్థులు కూడా తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులు సీట్లు పొందేందుకు టీఎస్ సర్కార్ వీలు కల్పించిన విషయం తెలిసిందే. కన్వీనర్ కోటాలో 15 శాతం నాన్ లోకల్ సీట్లకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేలా అవకాశం కల్పించారు. ఈ విధానాన్ని అప్పుడు పదేళ్లకు పొడిగించారు.

2014 జూన్ 2న అమలులోకి వచ్చిన ఈ విధానం.. 2024 జూన్ 2 వరకూ మాత్రమే అమలులో ఉంటుంది. అయితే 2014 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. తాజాగా తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చెప్పిన దాని ప్రకారం.. ఈసారికి మాత్రం ఏపీ విద్యార్థులు కన్వీనర్ కోటా కింద తెలంగాణ విద్యాసంస్థల్లో ఎప్ సెట్ తో పాటు వివిధ కోర్సుల్లో 15 శాతం సీట్లు దక్కించుకోవచ్చు. మెజారిటీ 85 శాతం సీట్లు మాత్రం తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల కోసం కేటాయించడం జరిగింది.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి