iDreamPost
android-app
ios-app

APలో పింఛన్లు తీసుకునే వారికి గుడ్‌న్యూస్‌.. సర్కార్‌ కీలక నిర్ణయం

  • Published May 29, 2024 | 8:05 AM Updated Updated May 29, 2024 | 8:05 AM

మరో మూడు రోజుల్లో జూన్‌ నెల ప్రారంభం కానుంది. క్రమంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

మరో మూడు రోజుల్లో జూన్‌ నెల ప్రారంభం కానుంది. క్రమంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 8:05 AMUpdated May 29, 2024 | 8:05 AM
APలో పింఛన్లు తీసుకునే వారికి గుడ్‌న్యూస్‌.. సర్కార్‌ కీలక నిర్ణయం

మరో మూడు రోజులు అయితే మే నెల ముగిసిపోతుంది. జూన్‌ నెల ప్రారంభం అవుతుంది. నెల ప్రారంభంలో కచ్చితంగా అమలయ్యే అంశాలు కొన్ని ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటో తారీఖునే పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పింఛన్ల పంపిణీ కోసం ప్రత్యేకంగా వాలంటీలర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు.. ఉదయాన్నే లబ్దిదారుల ఇళ్లకు చేరుకుని.. వారి చేతికి పింఛన్‌ డబ్బులు అందజేస్తారు. అయితే ఏప్రిల్‌ నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయింది. చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ కుట్ర వల్ల.. వాలంటీర్లు పెన్షన్‌ పంపిణీ చేయడానికి ఎన్నికల కమిషన్‌ అంగీకరించలేదు. దాంతో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

దీని వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అసలే వేసవి కాలం.. ఇక ఈ సారి భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత వేడిలో వృద్ధులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు కాసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేడికి తాళలేక కొందరు మృతి చెందారు కూడా. దాంతో దిగి వచ్చిన ఈసీ.. మే నెల పెన్షన్లకు సంబంధించి.. మార్పులు చేసింది. నేరుగా లబ్ధిదారులు ఖాతాలో నగదు జమ చేసేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు జూన్‌.. వచ్చేస్తోంది. మరి ఈ నెల పెన్షన్ల పంపిణీ ఎలా ఉండనుంది.. ఈసారైనా తిప్పలు తప్పుతాయా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఆ వివరాలు..

జూన్‌ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. మే నెల మాదిరిగానే.. జూన్‌లో కూడా లబ్ధిదారుల ఖాతాలో ఫించన్‌ మొత్తం జమ చేయాలని సూచించింది. అంతేకాక దివ్యాంగులు, నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వీల్‌ఛైర్‌కే పరిమితమైన వారికి మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అయితే గత నెలలో బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారు. మరి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పెన్షన్ల పంపిణీకి సంబందించి.. ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. వారు పింఛన్లు పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేశారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్ని జమ చేశారు. ఈ నెల కూడా అదే విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత నెల నుంచి అనగా జులై నెల నుంచి పింఛన్లను పంపిణీ చేయనుంది. వైఎస్సార్‌సీపీ తాము అధికారంలోకి రావడం ఖాయమని.. మళ్లీ వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయిస్తామని చెబుతోంది.