iDreamPost
android-app
ios-app

B.Tech ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి రూ.12000 శాలరీ! దేశంలోనే మొట్ట మొదటి సారిగా APలో!

  • Published May 16, 2024 | 10:54 AM Updated Updated May 16, 2024 | 10:54 AM

Good News for B Tech Final Year Students : ఏపీలో విద్యార్ధుల కోసం ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పింది.

Good News for B Tech Final Year Students : ఏపీలో విద్యార్ధుల కోసం ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పింది.

  • Published May 16, 2024 | 10:54 AMUpdated May 16, 2024 | 10:54 AM
B.Tech ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి రూ.12000 శాలరీ! దేశంలోనే మొట్ట మొదటి సారిగా APలో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా విద్య, వైద్య, మహిళ, రైతుల కోసం ఎన్నో వినూత్న పథకాలు అమలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్క పేద విద్యార్థి గొప్ప చదువు చదవాలనే ఆకాక్షంతో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేద విద్యార్థులు ఎదిగి.. సమాజంలో గొప్ప పేరు తీసుకురావాలని పలు సంరద్భాల్లో వైఎస్ జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన నిధుల ద్వారా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేళ్లేలా చేశారు. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో వివిధ పథకాలు అమలు చేస్తున్నామని పలు సందర్భాల్లో వైఎస్ జగన్ అన్నారు. తాజాగా బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గొప్ప శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. వివరాల్లోకి వెళితే..

ఏపీలోని బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. విద్యార్థుల కోసం వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి గవర్నమెంట్ హై స్కూల్ లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్ పర్ట్ ప్రోగ్రామ్ ప్రవేశ పెట్టబోతుంది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగం ఎంతో అభివృద్ది చెందుతుంది.. భవిష్యత్ లో ప్రతి విద్యార్థికి టెక్నాలజీ పై అవగాహన ఉండేందుకు ప్రోగ్రామ్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఫ్యూచర్ ఎక్స్ పర్ట్ కార్యక్రమంలో భాగంగా ఏపీలో ఉన్న 7,094 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నాటికి 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపిక చేసి విధులకు హాజరు అయ్యేలా చూస్తామని ఆయన అన్నారు.

ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను కొంతమంది ఎంపిక చేసి వారితో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన, అభ్యసనం గురించి అవగాహన కల్పిస్తారు. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక విషయంలో ఆయా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్స్ తో మాట్లాడాలని ఏపీ విద్యాశాఖ ఇప్పటికే ఆర్జేడీలు, డీఈవోలకు సూచనలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 12 నాటికి 26 జిల్లాల్లో ప్రతి 3 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్‌ను నియమిస్తామని ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్‌ కి ఎంపికైన బీటెక్ విద్యార్థులకు రూ.12 వేల సాలరీ చెల్లిస్తామని అన్నారు. ఈ విధానం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే మొదలవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.