పవన్ కల్యాణ్ కి షాక్.. బెదిరిస్తున్నారంటూ ECకి ఫిర్యాదు..

Complaint To EC On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఫిర్యాదులో పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ పేర్కొన్నారు.

Complaint To EC On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఫిర్యాదులో పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ పేర్కొన్నారు.

ఏపీలో ఎన్నికల వాతావరణం రాను రాను వేడెక్కుతోంది. ప్రత్యర్థి పార్టీలు పోటీకి మల్లగుల్లాలు పడుతుంటే.. అధికార వైఎస్సార్ సీపీ మాత్రం 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతోంది. జనసేన పార్టీ పరిస్థితి మరీ అగమ్యగోచరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ అసంతృప్త నేతలను బుజ్జగించలేకపోతోంది. అటు పోటీ మీద దృష్టి పెట్టాలో.. ఇటు నేతల బుజ్జగింపు పర్వాలు చూసుకోవాలో తెలియని పరిస్థితి వాళ్లది. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పవన్ కల్యాణ్ పై ఈసీకి ఫిర్యాదు అందింది. తనని బెదిరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. పవన్ కల్యాణ్ పై నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదులో పవన్ కల్యాణ్ తనని బెదిరిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వెంటనే పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షేక్ జలీల్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జలీల్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, బాలశౌరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ కాగా.. నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం బకెట్ ని గుర్తుగా కేటాయించింది. చూడటానికి గాజు గ్లాసు, బకెట్ గుర్తులు ఒకేలా ఉంటాయని.. ఎన్నికల్లో ఓట్లు తారుమారు అయ్యే ప్రమాదం ఉందనే తమను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నట్లు జలీల్ వ్యాఖ్యానించారు. తమని ఎన్నికల్లో పోటీ చేయద్దు అంటూ జనసేన నేతలు బెదిరిస్తున్నారంటూ జలీల్ ఆరోపణలు చేశారు. అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎంపీ బాలశౌరి అయితే ఏకంగా తనని తుపాకీ బెదిరించారంటూ ఆరోపిచడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఎన్నికల నుంచి తప్పుకోవడానికి రూ.5 కోట్లు ఆఫర్ చేసినట్లు జలీల్ ఆరోపిస్తున్నారు.

అయినా జనసేన పార్టీ నేతలు పెట్టో ప్రలోభాలు, ఇస్తానన్న రూ.5 కోట్ల తాయిలాలను లొంగేది లేదని తెగేసి చెప్పారు. నవరంగ్ పార్టీ విషయానికి వస్తే.. ఈ పార్టీ కూటమిగా పోటీలోకి దిగుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ జైభారత్ పార్టీ సహా.. ఇలాంటి కొన్ని పార్టీలతో కలిపి ఒక యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భాగంగానే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మరి.. జలీల్ చేసిన ఆరోపణలపై, జనసేన నేతలు బెదిరించడంపై లక్ష్మీనారాయణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. గతంలో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ సిద్ధాంతాలు, అధినేత తీరు నచ్చక లక్ష్మీనారాయణ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. మరి.. పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments