Mudragada Padmanabham: తన అభిమానులకు ముద్రగడ లేఖ.. కీలక అంశాల ప్రస్తావన!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులకు ముద్రగడ ఓ లేఖ రాశారు.

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన అభిమానులకు ముద్రగడ ఓ లేఖ రాశారు.

ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్ గా ఉంది. ముఖ్యంగా అధికార, విపక్ష కూటమి మధ్య నువ్వానేనా అన్నట్లు పొలిటికల్ వార్ నడుస్తోంది. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇదే సమయంలో పలువురు కీలక నేతలు, ఇతర పార్టీలకు చెందిన వారు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. అలానే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలోకి చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ బహిరంగ లేఖ రాసిన ఆయన..తాజాగా మరో లేఖను అభిమానులకు రాశారు.

వైఎస్సార్ సీపీలోకి చేరికలు పెరిగాయి. టీడీపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ కేశినేని నాని, స్వామిదాస్, గొల్లపల్లి సూర్యరావు, నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జీగా ఉన్న వెంకటేశ్వరావు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరే కాక కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్యనేతలు కూడా చేరారు. కాపు సంక్షేమ  సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాస్ వైఎస్సార్ సీపీలో చేరారు. అలానే జనసేనాలో చేరుతారనుకున్న మాజీ మంత్రి, కాపు సామాజికవర్గంలో కీలక నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు.

అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది. ఆయన 14వ తేదీ కాకుండా 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరే అవకాశముందని సమాచారం. తొలుత కిర్లంపూడి నుంచి తాడేపల్లికి పదివేల మందితో ర్యాలీగా రావాలని భావించారు. తన చేరికపై ఇటీవల అభిమానులకు ఓ లేఖ రాశారు. అందులో ఎవరి భోజనం వాళ్లే తెచ్చుకోవాలని, వాహనాలు కూడా సొంతంగానే సమకూర్చుకోవాలని ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే తాజాగా అభిమానులకు మరో లేఖ రాశారు. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరిక వాయిదా పడిందని,  ఈ నెల 15 లేదా 16వ తేదిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరిక ఉంటుందని తెలిపారు.

సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తనతో ఎవరూ రావొద్దని అభిమానులకు ముద్రగడ పద్మనాభం మనవి చేశారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది. భద్రత కారణాల దృష్ట్యా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు ర్యాలీకి  అనుమతి ఇవ్వకపోవడంతో ముద్రగడ కేవలం తన కుటుంబ సభ్యులతోనే కలసి వచ్చి తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఈ నెల14వ తేదీన సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలో ఉండటం కూడా ముద్రగడ చేరిక వాయిదా పడటానికి కారణమని తెలుస్తోంది.

Show comments