Arjun Suravaram
Margani Bharat, Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత పిఠాపురంలో అసమ్మతి సెగలు రేగాయి. ఇదే సమయంలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Margani Bharat, Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆ ప్రకటన తరువాత పిఠాపురంలో అసమ్మతి సెగలు రేగాయి. ఇదే సమయంలో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Arjun Suravaram
గురువారం కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గీయులు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగల బెడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటి ఈ అసమ్మతి సెగలు ఉవ్వెత్తునా ఎగసి పడ్డాయి. పిఠాపురంలో జరిగిన సంఘటనపై జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు జనసేన, టీడీపీలపై సెటైర్లు వేస్తున్నారు. పవన్ భయంతో భీమవరం నుంచి పిఠాపురం పారిపోయారని కొందరు అంటున్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబే ఓడిస్తారనే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
గురువారం వైఎస్సార్ సీపీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలోని సుబ్రమణ్య మైదానంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా పలువురు ఇళ్ల పట్టాలను అందజేశారు. అలానే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులే మరోసారి తమను అధికారంలోకి తీసుకొస్తాయని అన్నారు. అలానే ఒకే రోజు 25 వేల ఇళ్ల పట్టాల పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని ఆయన తెలిపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకేరోజు 25వేల ఇళ్ల పట్టాల కోసమని రూ. 300 కోట్లు విడుదల చేశారన్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో ఆలస్యమైందని. అలా జరగకుండా ఉంటే రాజమండ్రిలో పట్టాల పంపిణీ ఎప్పుడో పూర్తయ్యేదని భరత్ అన్నారు. ఇలాగే ఇళ్ల పట్టాల అందుకున్న తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళను టిడిపి సోషల్ మీడియా హింసించి బలి తీసుకుందని ఆయన విమర్శించారు. ఇదే కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయంపై ఎంపీ భరత్ స్పందించారు. పవన్ కల్యాణ్ కి పిఠాపురంలో కూడా చేదు అనుభవం తప్పదని భరత్ అన్నారు. తాము చిన్న చిన్న మార్పులు చేస్తే..భయ పడ్డారు, ఇక్కడి చెల్లనిది, వేరే చోట చెల్లుతుందా అంటూ ప్రతిపక్షాలు తెగ హంగామా చేశాయని, మరీ ఇప్పుడు వాళ్లు చేస్తుంది ఏంటని ఆయన దుయ్యబట్టారు.
పొలిటికల్ ట్రాన్స్ ఫర్ లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురం వెళ్లారా? అంటూ ఎంపీ భరత్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ అవకాశం ఇవ్వని, ఆ పని బాబే చేస్తారని తెలిపారు. చంద్రబాబే ఇండిపెండెంట్ ను నిలబెట్టి పవన్ కల్యాణ్ ను ఓడిస్తారేమో అంటూ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రాజకీయ పరిణామాలను జనసేన నేతలు లోతుగా పరిశీలించుకోవాలని సూచించారు. మొత్తంగా పవన్ ను చంద్రబాబే ఓడిస్తారంటూ ఏంపీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతోన్నాయి. మరి.. ఎంపీ మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.