iDreamPost
android-app
ios-app

వర్షాలు ఇక లేనట్టే.. ముదరనున్న ఎండలు!

  • Published May 27, 2024 | 8:50 AM Updated Updated May 27, 2024 | 8:50 AM

No More Rains: ఈ ఏడాది వాతావరణంలో పలు కీలక మార్పులు సంభవించాయి. మార్చి, ఏప్రిల్ లో దంచి కొట్టిన ఎండలు మే నెలలో మరింత ఉగ్ర రూపం దాల్చుతాయని భావించారు.. కానీ రెమాల్ తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడి వాతావరణం చల్లబండిది.

No More Rains: ఈ ఏడాది వాతావరణంలో పలు కీలక మార్పులు సంభవించాయి. మార్చి, ఏప్రిల్ లో దంచి కొట్టిన ఎండలు మే నెలలో మరింత ఉగ్ర రూపం దాల్చుతాయని భావించారు.. కానీ రెమాల్ తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడి వాతావరణం చల్లబండిది.

వర్షాలు ఇక లేనట్టే.. ముదరనున్న ఎండలు!

ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ లో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఎండలకు తోడు వడగాలులు వీయడంతో ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం చుక్కలు చూపించాయి. ఎండతాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతల పానియాల వెంట పరుగులు తీశారు. వడదెబ్బతో పలువురు మృతి చెందారు. మార్చి, ఏప్రిల్ తర్వాత మే నెలలో ఎండలు ముదిరి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. ఈసారి ఇందుకు భిన్నంగా వాతావరణంలో మార్పులు రావడం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డా.. ఇప్పట్లో వర్షాలు లేనట్లే అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు ముదిరిపోయే సూచన కనిపిస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

మార్చి, ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఏకంగా 45 డిగ్రీల సెల్సీయస్ నమోదు అయ్యింది. వారం నుంచి తీవ్ర తుఫాన్ గా బలపడిన ‘రెమాల్’ ఆదివారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు రెమాల్ తుఫాన్ ముప్ప తప్పినట్టే అంటున్నారు. అంతకు ముందు తుఫాన్ గంటలకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. ఏపీలో పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మొదలైంది. రాబోయే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడి.. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

No rains

ఇదిలా ఉంటే సోమవారం నుంచి ఎండలు తీవ్ర దాల్చి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచన కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. రెమాల్ తుఫాన్ ముప్పు తప్పినా.. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అయ్యే సూచన కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. నైరుతీ రుతుపవనాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. వడగాలులు తీవ్ర రూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో భారీ స్థాయిలో ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.