iDreamPost
android-app
ios-app

NTR చెప్పులు వేయించింది ప్రజల కోసమేనా? భువనేశ్వరి వ్యాఖ్యలపై పోసాని ఫైర్..

NTR చెప్పులు వేయించింది ప్రజల కోసమేనా? భువనేశ్వరి వ్యాఖ్యలపై పోసాని ఫైర్..

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజకీయ చదరంగం మంచి హీట్ మీద ఉంది. ముఖ్యంగా 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, జైలుకు వెళ్లిన తరువాత రాజకీయం మరింత హీటెక్కింది. అధికార పార్టీ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అవినీతి చక్రవర్తి  అయిన చంద్రబాబు పాపం పడిందని, ఇక ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటాడంటూ వైసీపీ నేతలు ఘాటుగా విమర్మిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి కూడా ప్రజలు, రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.

శనివారం మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు.. జైల్లో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తారని ఆయన భార్య భువనేశ్వరి సానుభూతి రాజకీయం చేయడపై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో కూడా ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడని అనటం దుర్మార్గమని, ఆనాడు మీ నాన్న ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించింది కూడా ప్రజల కోసమేనా?, మీ నాన్నని వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా? అంటూ భువనేశ్వరిని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారని, ఎన్టీఆర్పై చెప్పులతో దాడి చేయించింది చంద్రబాబే. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తులేవా? అని నిలదీశారు.     అలానే ఈనాడు రామోజీరావు కథనాలు రాస్తుండటపై  కూడా పోసాని ధ్వజమెత్తారు.  రాజమండ్రి సెంట్రల్ జైలులో కుట్రలు అంటూ ఈనాడు కథనాలపై ఆయన మండిపడ్డారు. రామోజీరావు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ విమర్శించారు.  సూపరిండెంటెండ్  రాహుల్ భార్య అనారోగ్యంతో మరణిస్తే.. రామోజీరావు పిచ్చిరాతలు రాయడం వెనుక ఉద్దేశం ఏంటని పోసాని ప్రశ్నించారు.

ఒక మహిళ చనిపోతే రామోజీ పిచ్చి రాతలు రాశారని, అదే ఆయన చనిపోతే  వారి కుటుంబ సభ్యులు వెళ్లరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాహుల్ భార్య అనారోగ్యంతో ఉంటే.. ఆయన లీవ్ పెట్టారు. అందుకే వేరే అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారని పోసాని స్పష్టం చేశారు. ఈనాడు, టీవీ5, ఏబీఎన్ ఎంత ఏడ్చినా ప్రలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. మరి… పోసాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/