iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్!

Gudivada Amarnath Comments: ఆదివారం రాజకీయ వ్యూహకర్త ఓ కార్యక్రమంలో పాల్గొన్ని వైఎస్సార్ సీపీ ఓటమి పాలవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Gudivada Amarnath Comments: ఆదివారం రాజకీయ వ్యూహకర్త ఓ కార్యక్రమంలో పాల్గొన్ని వైఎస్సార్ సీపీ ఓటమి పాలవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 175 స్థానాల్లో విజయం సాధించేలా అధికార వైఎస్సార్ సీపీ ప్రణాళికలను రచిస్తుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపును ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నో విన్యాసాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల వారి చేత సీఎం జగన్ పై అసత్య ప్రచారాలు చేయించేందుకు కూడా వెనుకాడటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..వైసీపీ ఓటమి పాలవుతుందంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాథ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

ఆదివారం విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలు, సీఎం జగన్ పరిపాలనలో సంస్కరణల గురించి వివరించాడు. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. బిహార్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటూ ప్రశాంత్ కిషోర్ పై విరుచుకపడ్డారు. బిహార్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ దిక్కుమొక్కూ లేకుండా చిత్తుగా ఓడిందని, అదే తరహాలోనే చంద్రబాబు, పవన్‌ ఓటమికి సిద్ధంగా ఉన్నారని అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. డబ్బులు తీసుకుని రాజకీయ వ్యూహాకర్తగా ఉండే ప్రశాంత్‌ కిషోర్‌ బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఆ పార్టీ బిహార్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిందని అన్నారు. ఇలా ఇంట గెలవని వాడి మాటలను ఏపీ ప్రజలు నమ్మరని మంత్రి చెప్పారు.

చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ పలుమార్లు రహస్యంగా సమావేశం అవుతున్నారని, అందులో భాగంగానే రెండు రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో వారిద్దరు రహస్యంగా కలుసుకున్నట్లు పలు పత్రికల్లో వచ్చిందని ఆయన తెలిపారు. ఒక పీకే వల్ల కావడంలేదని చంద్రబాబు రెండో పీకేని కూడా తెచ్చుకున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఒక మాటతో మొత్తం ప్రజల నాడిని మార్చవచ్చని, తాను మహా మాంత్రికుడినని అనుకుంటున్న ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తన సొంత రాష్ట్రం బిహార్‌లో పొలిటికల్ బెగ్గర్ గా మారాడని మంత్రి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, చెల్లని రూపాయి ప్రశాంత్‌ కిషోర్‌ కొత్త ఎత్తుగడలకు పన్నాగాలు పన్నుతున్నారని, వాటిని ప్రజలు  ఎన్నికల్లో తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన వైసీపీ గెలుస్తుందని సామాన్యులు సైతం చెబుతున్నారని  ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. సామాన్యులు చెప్పేది నెగ్గుతుందా? లేక చెల్లని రూపాయి ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పేది నెగ్గుతుందా? అనేది మీరే చూస్తారని ఆయన పేర్కొన్నారు.

బిహార్‌లో చెల్లనిరూపాయిగా మారడంతో ఇక్కడ కొన్ని డబ్బులైన ఏరుకుందామనే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నారని  మంత్రి చెప్పారు. 2019 ఎన్నికల ముందు కూడా టీడీపీ భారీ విజయం సాధించనున్నట్లు లగడపాటి రాజగోపాల్‌తో చంద్రబాబు జోస్యం చెప్పించారని, ఆ తరువాత ఏం జరిగిందో అందరికి  తెలిసిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పై మంత్రి అమర్నాథ్  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి..పీకేపై మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.