ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాద యాత్ర మొదలుపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారనుకున్న పీకే.. అందరికీ షాకిస్తూ, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని తేల్చేశారు. అలాగని ఇది కొత్త పార్టీ ప్రకటన కాదు. ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను ప్రకటించలేదు. ‘జన్ సురాజ్’ కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతా. నా అభిప్రాయంతో కలిసి వచ్చే వారిని, నా ఉద్యమంలో చేర్చుకుంటాను. నేను రాజకీయ పార్టీ పెడితే, అది ప్రశాంత్ కిషోర్ […]
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆయన తరపున వ్యూహకర్తగా పని చేసేందుకు సిద్ధమని మూడు రోజుల క్రితం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీకి, తమిళనాడులో స్టాలిన్ కు మద్దతు తెలిపిన వారందరినీ కలిసి కృతజ్ఞతలు చెబుతున్నానని.. అందులో […]
రాష్ట్రంలో 200 సీట్లు సాధిస్తాం.. అధికారంలోకి వస్తామని బెంగాల్ ఎన్నికలకు చాలా ముందు నుంచే బీజీపీ ప్రకటించింది. అదే వ్యూహంతో అక్కడ ఎన్నికల వ్యూహాలు అమలు చేసింది. అయితే బీజేపీకి 200 కాదు.. 100 సీట్లు కూడా రావు. వంద మార్కు దాటితే ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం మానేస్తానని తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ సవాల్ చేశారు. ఫలితాలు ఆయన మాటలనే నిజం చేస్తున్నాయి. పార్టీల రాజకీయ పోరాటం ఎలా ఉన్నా.. వ్యూహకర్తగా […]
అపర చాణక్యుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించారు. ‘‘నేను ఇప్పుడు చేస్తున్నదాన్ని ఇకపై కొనసాగించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చేయాల్సినంత చేశాను. బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. జీవితంలో ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ స్పేస్ (ఎన్నికల వ్యూహకర్తగా) విడిచిపెట్టాలనుకుంటున్నాను’’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాను ఫెయిల్ అయిన రాజకీయ నాయకుడిని అని అన్నారు. అయితే భవిష్యత్తులో ఏం చేస్తారనేది […]
‘మమత ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది.. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది’.. అన్నమాటలతో కూడిన ఓ ఆడియో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. భారతీయ జనతా పార్టీ పోస్ట్ చేసిన ఈ ఆడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సరికొత్త రాజకీయ దుమారం రేపుతోంది. తన ప్రధాన ప్రత్యర్థి అయిన టీఎంసీ ఓడిపోతుందని బీజేపీ ప్రచారం చేయడంలో వింతేముంది. ఎన్నికల్లో ఇటువంటి గేమ్ ప్లాన్లు మాములే కదా అని అనుకోవడానికి వీల్లేదు. […]
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు తృణముల్ కాంగ్రెస్, తొలి సారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ పోటా పోటీ రాజకీయాలు చేస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య భౌతిక దాడులు జరుగుతుండగా.. అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇరు పార్టీలు నువ్వా..? నేనా..? అన్నట్లు పోరాడుతున్నాయి. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా […]
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయంటారు. అందుకే ఇతరుల గురించి మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలంటారు. లేదంటే రేపు మనం కూడా అ స్థితిలోకి వచ్చినప్పుడు నవ్వులపాలుకాకతప్పదు. మరీ ముఖ్యంగా ప్రజా జీవితంలో ఉండేవారు అత్యంత జాగ్రత్తగా తమ నాలుకను ఉపయోగించాలి. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడును, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు అయితే మరింత అప్రమత్తంగా మాట్లాలి. లేదంటే తర్వాత రోజుల్లో విమర్శలపాలవ్వాల్సి వస్తుంది. నాడు – నేడు.. అంటూ చంద్రబాబు మాటలను ప్రసారం చేస్తూ ఇప్పటికే రాజకీయ […]
దేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికే)అంటే..సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాన మంత్రి వరకు అందరికి బాగా తెలిచిన వ్యక్తే…దేశంలో ప్రధాని మోడీతో పాటు..వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పని చేసిన ప్రశాంత్ కిశోర్…మరో కొంత మంది నేతలతో కలిసి పని చేస్తున్నారు. పికేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. అందుకనుగుణంగా ఆయనను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటుంది. ఈ నేపథ్యంలో […]
దేశంలో అమలులో ఉన్న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ప్రయాణించారనే వార్తలపై కేంద్రం విచారణ చేపట్టింది.కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రం, ప్రతిపక్షాల ఆరోపించాయి.దీంతో విమర్శలను తిప్పికొట్టడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి సలహా కోసం ప్రశాంత్ కిశోర్‌కు పిలుపు వచ్చిందని చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో మమతా పిలుపు మేరకు ఆయన కార్గో విమానంలో […]
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రెండోసారి మరో 19 రోజులపాటు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్‌డౌన్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకవేళ లాక్డౌన్ సత్ఫలితాలు ఇవ్వకపోతే ప్రభుత్వం వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో ఏమన్నారంటే, లాక్‌డౌన్‌పై చర్చ ఇప్పట్లో ముగిసేది కాదు. అయితే వాస్తవం ఏమిటంటే ఒకవేళ లాక్డౌన్ వల్ల […]