గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థినిల ధైర్యానికి హ్యాట్సాఫ్! సంచలన నిర్ణయం!

Gudlavalleru College Students Issue: గుడ్లవల్లేరు కళాశాల ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Gudlavalleru College Students Issue: గుడ్లవల్లేరు కళాశాల ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన సంచలనంగా మారింది. అమ్మాయిల హాస్టల్ లోని బాత్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు అనే ఆరోపణ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాలేజీ విద్యార్థినులు నిరసనలను ఉద్ధృతం చేశారు. అలాగే ఏబీవీపీ వంటి విద్యార్థి సంఘాలు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కి మద్దతుగా వచ్చారు. అసలు విచారణ కూడా చేయకుండా అసలు కమెరాలే లేవు అంటూ కొట్టి పారేస్తున్నారు అంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరగాలని.. సరైన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురు మహిళా సిబ్బందితో కమిటీని ఏర్పాటు చేశారు.

గుడ్లవల్లేరు ఘటన ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ విషయంలో అసలు నిజాలు బయటకు రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ధర్నాలు చేస్తున్న విద్యార్థులకు స్థానికుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. స్టూడెంట్స్ కి మద్దతుగా నిరసలను దిగాలి అని స్థానిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మేసేజ్లు వైరల్ అవుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘానికి రిపోర్ట్ చేస్తాం అంటున్నారు. విద్యార్థుల ధైర్యానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఎలాగైనా ఈ విషయంలో తమకు న్యాయం జరగాలి అని. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఏది నిజం అనేది నిగ్గు తేల్చాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

అలాగే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఆడియో క్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా ఈ ఘటనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన మూడ్రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చింది అంటూ స్టూడెంట్స్ వార్డెన్ తో చెప్పారు. అలాగే పోలీసులు, అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ విషయాలపై అధికారులు కూడా స్పందించారు. సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అని వెల్లడించారు. ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థుల కెరీర్ కి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. గుడ్లవల్లేరు ఘటనను జాతీయ మానవ హక్కుల దృష్టికి తీసుకెళ్లాలి అనుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments