Andhra Pradesh: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ! చనిపోయాడనుకుంటే.. అతడే ఫోన్ చేశాడు!

తూర్పుగోదావరి జిల్లాలో సినిమాను మించిన ఓ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. చనిపోయాడనుకున్న వ్యక్తి నుంచే కుటుంబ సభ్యులకు ఫోన్ కాలు వచ్చింది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లాలో సినిమాను మించిన ఓ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. చనిపోయాడనుకున్న వ్యక్తి నుంచే కుటుంబ సభ్యులకు ఫోన్ కాలు వచ్చింది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కరెంట్ షాక్ తో మరణించిన ఓ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువుతు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇక ఇదే టైమ్ లో కుటుంబ సభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు.. చనిపోయాడని భావిస్తున్న వ్యక్తే. దీంతో అసలు ఏం జరుగుతుందో? ఏం జరిగిందో? అన్న ఆందోళన మెుదలైంది. సినిమాను మించిన ఈ క్రైమ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. మూవీని తలపించే ఈ క్రైమ్ స్టోరీ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరెంట్ షాక్ తో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు.. చనిపోయాడని భావిస్తున్న కేతమళ్ల పూసయ్య. దీంతో ఏం జరుగుతుందో తెలీక ఫ్యామిలీతో పాటుగా కుటుంబ సభ్యులు షాక్ కు గురైయ్యారు. ఈ విషయం తెలియడంతో.. పూసయ్య చెప్పిన అడ్రస్ కు హుటాహుటిన బయలుదేరారు ఫ్యామిలీ మెంబర్స్. అక్కడి వెళ్లి చూడగా.. గాయాలతో పడిఉన్న పూసయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందని అతడిని ప్రశ్నించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలేం జరిగింది అంటే?

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి కేతమళ్ల పూసయ్య పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దగ్గర సగం కాలిపోయిన శవం ఉండటానికి సమీప రైతులు గుర్తించారు. శవం దగ్గర పూసయ్య చెప్పులు ఉండటంతో.. అతడే చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇదే టైమ్ లో పూసయ్య నుంచి ఫోన్ వచ్చింది. ఇక ఈ ఘటనలో పూసయ్య విస్తుపోయే నిజాలను వెల్లడించాడు.

“నేను పొలం దగ్గరికి వెళ్లగా.. అక్కడ ముగ్గురు యువకులు ఓ మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. దీంతో నేను అక్కడి వెళ్లి వారిని ప్రశ్నించగా.. వారు నాపై దాడిచేశారు. నా చెప్పులను అక్కడే పడేసి.. స్పృహ తప్పిన నన్ను ఆటోలో తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు నాకు స్పృహ వచ్చి చూస్తే.. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో ఉన్నాను. ఓ వ్యక్తి దగ్గర ఫోన్ నుంచి మీకు కాల్ చేశాను” అంటూ పూసయ్య చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సంచలన కేసులో మూడు ప్రశ్నలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు? ఆ ముగ్గురు హంతకులు ఎవరు? అసలు పూసయ్యను ఎందుకు హత్య చేయాలనుకున్నారు? అన్న ప్రశ్నలు ఇప్పుడు పోలీసుల ముందున్నాయి. సినిమాను మించిన ఈ క్రైమ్ స్టోరీ స్థానికంగా సంచలనంగా మారింది.

Show comments