Keerthi
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ భారీ వర్షాల ధాటికి శ్రీశైలంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ భారీ వర్షాల ధాటికి శ్రీశైలంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కుండపోతు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ భారీ వర్షాలు కారణంగా.. కొన్ని ప్రాంతల్లో నదులు, చెరువులు, కాలువలు పొంగిపోయి ఇళ్లలోకి నీళ్లు చేరిపోవడంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో అయితే వాతవరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే.. ఉదయం మొత్తం తీవ్రమైన ఎండతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మధ్యహ్న సమయంలో మాత్రం నల్లని మోఘలు, విపరీతమైన గాలులు వీస్తూ భారీ వాన కురుస్తంది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతలన్ని జలమయం అవుతన్నాయి. ముఖ్యంగా ఈ భారీ వర్షాలు, గాలులు కారణంగా పెద్ద పెద్ద చెట్లు విరిగిపడటం ప్రజా రావణాకు ఇబ్బందిగా మారుతుంది. ఈ మేరకు తాజాగా ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భారీ వర్షం కురవడంతో.. కొండచరియాలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎంతటి బీభత్సం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ భారీ వర్షాల ధాటికి ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. సూమరు 4 గంటల పాటు ఏకదాటిగా ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షం కారణంగా.. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర బుధవారం అర్ధరాత్రి ( ఆగస్టు 21, 2024 ) ఈ కొండ చరియలు విరిగి పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొండచరియలు రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కానీ, ఆ సమయంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువన అటవీప్రాంతం నుంచి ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక ఈ వరద ప్రవాహంలో పలు బైకులు కూడా కొట్టుకుపోయాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా కొత్తపేట, శ్రీగిరి కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇకపోతే ఆ ప్రాంతంలో రాకపోకలు జరిపే ప్రయాణికులు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు హెచ్చరించారు. అతేకాకుండా.. లోతట్టు కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహయక చర్యలు అందిస్తున్నమని తెలిపారు.