iDreamPost
android-app
ios-app

కర్నూలు రాజకీయాన్ని కంటి చూపుతో మార్చిన జగన్! ఇది మాస్ అంటే!

YS Jagan, Kurnool: ఏపీ రాజకీయాలు రోజు రోజుకి చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

YS Jagan, Kurnool: ఏపీ రాజకీయాలు రోజు రోజుకి చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

కర్నూలు రాజకీయాన్ని కంటి చూపుతో మార్చిన జగన్! ఇది మాస్ అంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్నకొద్ది ఈ వేడీ పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది. అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీలో వ్యూహ, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా సీఎం జగన్ గెలుపును ఆపాలనే టీడీపీ,జనసేన కూటమి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో వారికి షాక్ తగిలే విధంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన నియోజకవర్గాల ఇన్ ఛార్జీల ప్రకటనే అందుకు నిదర్శనం. టీడీపీ,జనసేన ఊహకందని విధంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తాజాగా కర్నూలు అసెంబ్లీ స్థానం విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి టీడీపీ అయోమయంలో పడిపోయింది.

శుక్రవారం వైఎస్సార్ సీపీ తొమ్మిదోవ జాబితా విడుదల అయ్యింది. ఇందులో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు ఓ పార్లమెంట్ స్థానానికి ఇన్ ఛార్జీలను ప్రకటించింది. అందులో నెల్లూరు పార్లమెంట్ కు వి.విజయసాయిరెడ్డి, మంగళగిరికి మురుగుడు లావణ్య పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ రెండు స్థానాలతో పాటు కర్నూలు అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి  ఎ.ఎండి. ఇంతియాజ్ ను కర్నూలు అసెంబ్లీ ఇన్ ఛార్జీగా నియమించారు. గురువారం ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం శుక్రవారం వైసీపీ  కర్నూలు ఇన్ ఛార్జీ బాధ్యతలను  తీసుకున్నారు.

ఇక్కడ ఇప్పటి వరకు ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలో ఎవరో ఒకరు ఉంటారని భావించారు. అయితే వీరిద్దరికిలో ఎవరిని నియమించిన మరోకరు సహకరించరని టీడీపీ నేతలు భావించారు. ఈక్రమంలో తాము ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థిని నిలబెడితే వైసీపీ విజయాన్ని ఆపొచ్చని భావించారు. అలానే వారి ఆలోచనలకు తగినట్లే.. హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి.. ఎవరికి వారే ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అందుకే చాలా స్థానాలు ప్రకటించిన వైఎస్సార్ సీపీ కర్నూలు స్థానంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇక్కడ వర్గ పోరు ఉందని, తమకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనలో టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అయితే మాములుగానే సీఎం జగన్ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు..సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలానే తాజాగా కర్నూలు అసెంబ్లీ స్థానం విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ తలపట్టుకుంటుంది. జగన్ వ్యూహాలు అర్థం కాక పిచ్చేకుతుందని టీడీపీ నేతలే అనుకుంటున్నారు. మొత్తంగా కర్నూలు విషయంలో ఇంతియాజ్  పేరును ప్రకటించడం, ఆయనకు హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిలు మద్దతుగా తెలిపారు. అంతేకాక ఇంతియాజ్  కర్నూలు సొంత జిల్లా కావడం కూడా ఓ అనుకూల అంశం. ఇలా  అన్ని బలలాలు కలిగిన ఇంతియాజ్ ను కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ షాక్ కి గురైంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో టీడీపీ, జనసేనాలు అల్లాడిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.