కుప్పానికి కృష్ణమ్మ జలాలు! 14 ఏళ్లలో బాబు చేయలేనిది జగన్ చేశారు!

Krishna Waters To Kuppam: కుప్పం ప్రజల దాహార్తిని తీరుస్తానంటూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి చూపించారు.

Krishna Waters To Kuppam: కుప్పం ప్రజల దాహార్తిని తీరుస్తానంటూ సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కుప్పానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి చూపించారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సొంత నియోజకవర్గం వాళ్లే ఎన్నో రకాల విమర్శలు చేయడం చూశాం. కరవుతో అల్లాడుతున్న కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారనే అపవాదు ఉండనే ఉంది. హంద్రీనీవా ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కూడా 14 ఏళ్ల పాలనలో ఆ దిశగా అడుగులు వేయలేదనే విమర్శలు సొంత నియోజకవర్గం ప్రజలే చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి హంద్రీనీవా నీళ్లు కుప్పానికి తీసుకొస్తానని చెప్పడమే కాకుండా ఇప్పుడు చేసి చూపించారు కూడా.

ముఖ్యమంత్రి జగన్‌.. హంద్రీనీవా ద్వారా కుప్పానికి నీళ్లు తీసుకొస్తానని ఇచ్చిన హమీని నెరవేర్చారు. కుప్పం నియోజకవర్గ ప్రజానీకానికి తాగు, సాగునీళ్లు అందించేందుకు హంద్రీనీవా కాలువను ఏర్పాటు చేశారు. తాజాగా మంగళవారం హంద్రీనీవా కాలువ ద్వారా రామకుప్పం మండలం వర్ధికుప్పం గ్రామానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. ఎమ్మెల్సీ భరత్ తో పాటు రామకుప్పం వైసీపీ నాయకులు కృష్ణా జలాలకు స్వాగతం పలికారు. సీఎం జగన్ మాటివ్వడమే కాకుండా.. హంద్రీనీవా కాలువ ద్వారా సాగు, తాగునీటిని తెచ్చే ఏర్పాట్లు వేగవంతం చేశారు. తద్వారా నేడు హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మ జలాలు కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి.

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు మాత్రం కరువుతో అల్లాడుతున్న కుప్పం ప్రజల సాగు, తాగునీటి అవసరాలు ఏరోజూ పట్టించుకోలదేనే విమర్శలు ఉండనే ఉన్నాయి. కుప్పాన్ని కరువు బారినుంచి కాపాడాలంటే హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారమని తెలిసినా ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. పట్టంచుకోకపోగా 2019 ఎన్నికలు దగ్గర పడేసరికి తన పార్టీకి చెందిన వారికి ఈ కాంట్రాక్టు ఇచ్చి, అందులో కూడా కమీషన్ల అందుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కమీషన్లు పొందారే గానీ.. కుప్పానికి నీళ్లు మాత్రం తెప్పించ లేకపోయారని కుప్పం ప్రజలు అంటుంటారు. ముఖ్యమంత్రి జగన్ కుప్పం ప్రజలకు మాట ఇవ్వడమే కాకుండా.. ఆ మాటను నిలబెట్టుకుని చూపించారు. ఇప్పుడు కుప్పం ప్రజలు కూడా సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంటే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేేయండి.

Show comments