Arjun Suravaram
Chegondi Harirama Jogaiah: కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య తరచూ లేఖలు రాస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి చురకలు అంటిస్తుంటారు. తాజాగా మరోసారి పవన్ కి లేఖ రాసి.. ఆ స్థానాల విషయంలో రాజీపడొద్దని సూచించారు.
Chegondi Harirama Jogaiah: కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామజోగయ్య తరచూ లేఖలు రాస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి చురకలు అంటిస్తుంటారు. తాజాగా మరోసారి పవన్ కి లేఖ రాసి.. ఆ స్థానాల విషయంలో రాజీపడొద్దని సూచించారు.
Arjun Suravaram
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎలక్షన్లకు సమయం దగ్గర పడేకొద్ది ఇటు నేతలతో పాటు అటు ప్రజల్లోనూ ఎంతో ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు పూర్తిస్థాయి అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల సమరంలోకి దిగారు. ఇదే సమయంలో టీడీపీ,జనసేన పొత్తులో మాత్రం సీట్ల పంపంకం ఇంకా కొలికి రాలేదు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలు తమ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీట్లు తీసుకునే విషయంలో పలువురు నేతలు పవన్ కల్యాణ్ కి సలహాలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తరచూ లేఖలు రాస్తుంటారు. తాజాగా మరోసారి కూడా ఓ విషయంలో పవన్ కి మరోసారి లేఖ రాశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తోన్న రాజకీయం సొంత పార్టీ నేతలకు, కార్యకర్తలే అర్ధంకావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో 130 స్థానాలకు పైగా పోటీ చేసిన పవన్ కల్యాణ్.. ఈ సారి ఎక్కువ స్థానాలు దక్కించుకునే స్థితిలో ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. టీడీపీతో పొత్తు ప్రకటించిన రోజు నుంచి సీట్ల పంపకంలో పవన్ కల్యాణ్ ఘోరంగా తడబడుతున్నారు. కనీసం 30 స్థానాలు కూడా సాధించుకోలేని స్థితిలో పవన్ ఉన్నాడనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
మరోవైపు పవన్ కి పలువురు లేఖలు రాసి..తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య లాంటి వారు అయితే ఏకంగా పవన్ కల్యాణ్ కి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పవన్..కి లేఖ రాసిన హరిరామ జోగయ్య..తాజాగా మరోసారి లేఖ రాశారు. అయితే ఈ సారి మాత్రం కొన్ని స్థానాల పేర్లు ప్రస్తావిస్తూ, వాటి విషయంలో రాజీపడొద్దు అంటూ లేఖ రాశారు.
ఇలా సీట్ల విషయంలో రాజీపడొద్దంటూ హరి రామజోగయ్య పవన్‌పై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. తాజాగా ఆయన రాసిన మరో లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పావు వంతు జనాభాగా ఉండి, ఆర్థికంగా బలంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన పార్టీ కేటాయించాల్సిన అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు, అక్కడ పోటీ చేయాల్సిన అభ్యర్థుల వివరాలను ఆయన సమర్పించారు. అంతేకాక తాను ప్రస్తావించిన స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాల్సిందిగా హరి రామ జోగయ్య కోరారు.
ఇదే సమయంలో పవన్‌ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు. అలాగే.. తిరుపతి నుంచి పవన్ సోదరుడు నాగబాబును పోటీ చేయించాలని ఆయన సూచించారు. మొత్తంగా 6 పార్లమెంట్ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని హరి రామజోగయ్య తాజా లేఖ ద్వారా పవన్‌ను కోరారు. ఇప్పటికే అనేక మార్లు పవన్ కి హరి రామజోగయ్య లేఖలు రాశారు. తాజాగా రాసిన ఈ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.