సీనియర్ NTRకి నిజమైన రాజకీయ వారసుడు CM జగన్: జర్నలిస్ట్ సాయి!

సీనియర్ NTRకి నిజమైన రాజకీయ వారసుడు CM జగన్: జర్నలిస్ట్ సాయి!

ప్రస్తుతం చంద్రబాబు నాయుడి అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు స్కీల్ స్కాం కుంభకోణంలో అరెస్టు కావడంతో అందరిలో చర్చమొదలైంది. చంద్రబాబు అరెస్టు కావడమే ఆశ్చర్యం అంటే..రోజుల తరబడి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఏడు పదుల వయస్సులో బాబుకు ఇలాంటి దుస్థితి రావడంపై అందరు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను మానసిక క్షోభకు గురిచేసిన ఫలితమే ఇది అంటూ కొందరు అంటున్నారు. అంతేకాక ఎన్టీఆర్ క్షోభకు గురైన వయస్సులోనే చంద్రబాబుకు అదే  పరిస్థితి రావడం కర్మఫలితమేనని మరికొందరు అంటున్నారు. అయితే తాజాగా సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో ఓ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ నిజమైన వారసుడు జగన్ మోహన్ రెడ్డే అంటూ వ్యాఖ్యానించారు.

సీనియర్ ఎన్టీఆర్ మరణం గురించి అనేక మంది అనేక రకాలుగా చెబుతుంటారు. చంద్రబాబు, రామోజీరావు ఎన్టీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేసి.. రాసి.. ఆయనను మానసికంగా హింసించారని కొందరు అంటుంటారు. అలానే ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఉండగా  కుమారులు దూరం కావడానికి చంద్రబాబే కారణమని పలువురు తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ పదవిపోయి, బిడ్డలు దూరమై, అనేక తప్పుడు ప్రచారాలతో మానసికంగా వేదనకు గురయ్యాడు. అలానే ఎన్టీఆర్ మరణానికి  పరోక్షంగా చంద్రబాబు, రామోజీ రావు అని ఇప్పటికి చాలా మంది అంటుంటారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబుపై తన కోపాన్ని వ్యక్తం చేశాడు. చంద్రబాబు నీచుడు, దుర్మార్గుడు, వెన్నుపోటు దారుడు అంటూ ఎన్టీఆర్ తన వేదను వ్యక్తం చేశాడు.  ఇంతకాలం ఆయన బాధను తీర్చేది ఎవరా? అని అందరూ ఆసక్తికగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కాలం ఇద్దరు కలిసి ఎన్టీఆర్ ఆశయాన్ని నిరవేర్చారని కొందరు బలంగా నమ్ముతున్నారు.

అలానే సీనియర్ జర్నలిస్ట్ సాయి కూడా ఇదే విషయాన్ని  వ్యక్తం చేశారు. ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ..” చంద్రబాబు, రామోజీ రావు.. ఇద్దరూ కలసీ సీనియర్ ఎన్టీఆర్ ను మానసికంగా హింసించారు. ఇప్పుడు సరిగ్గా అదే వయస్సులో చంద్రబాబుకు, రామోజీ రావుకు జగన్ నరకం చూపిస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ వారసుడు జగన్ మోహన్ రెడ్డి అనాలేమో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ పని చేయలేక పోతున్నాడు. మిగిలిన ఎన్టీఆర్ వారసులకు ఆ ధైర్యం లేదు” అని జర్నలిస్ట్ సాయి అన్నారు. మరి.. సాయి చేసిన వ్యాఖ్యల నిజమేనా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments