iDreamPost

స్కిల్ స్కాం కేసు.. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్!

స్కిల్ స్కాం కేసు.. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్!

దేశ వ్యాప్తంగా సంచలన రేపుతున్న ఘటనల్లో చంద్రబాబు అరెస్ట్ ఒకటి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో  చంద్రబాబు అరెస్ట్  అయి.. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కస్డడీలో భాగంగా రెండు రోజులు చంద్రబాబు ను సీఐడీ విచారించింది. అయితే ఆయన సరిగ్గా సమాధానాలు చెప్పలేదని, దాటవేసే ధోరణి అవలంభించారని సమాచారం. ఇది ఇలా ఉంటే శుక్రవారం ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు  తిరష్కరించింది. దీంతో ఆయన తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే సోమవారం బాబు పిటిషన్ మెన్షన్ లిస్టులోకి వస్తుందని అందరు భావించారు. ఇక్కడ కూడా చంద్రబాబుకు షాక్ తగిలింది. మరి..  ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ ను  హైకోర్టు  కొట్టేసింది. అంతేకాక ఏసీబీ కోర్టు 11 రోజుల రిమాండ్ పొడగించింది. ఇలా స్కీల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాళ్లు చేస్తూ ఆయన తరపు లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. శనివారం చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అంతేకాక చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సిద్ధార్థ లూథ్రా సుప్రీం కోర్టులో మెన్షన్ చేశారు.

చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారని, అత్యవరసంగా విచారణ చేయాలని సిద్దార్థ లూథ్రా సుప్రీం కోర్టును కోరారు. అందరు సోమవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వస్తుందని భావించారు. ఇక్కడ తమకు అనుకూలం గా తీర్పు వస్తుందని  టీడీపీ నేతలు భావించారు. కానీ చంద్రబాబుతో పాటు టీడీపీ పార్టీ నేతలకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు మెన్షన్ లిస్ట్ లో చేరుస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. పిటిషన్ ను ఎప్పుడు విచారించాలన్న దానిపై రేపు నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. సుప్రీం కోర్టులో ఏదైనా విచారణ చేపట్టాలంటే..ముందు మెన్షనింగ్ లిస్టులేకి రావాలి.

ఆ మెన్షనింగ్ లిస్టులో ఉన్న కేసులను మాత్రమే సుప్రీం కోర్టు విచారిస్తుంది. తదుపరి తేదీ, సమయం ఎప్పుడు అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తుంది. అయితే సోమవారం విచారణకు వచ్చే కేసుల లిస్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ లేదు.  అలానే  సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు ఎస్ ల్పీ పిటిషన్ వేశారు. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, కళ్లెం అజయ్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. మరి.. ఈ విధంగా సుప్రీంకోర్టులో చంద్రబాబు చుక్కెదురు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి