జన్మభూమి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం…ఊడిపోయిన ట్రైన్ బోగీలు!

Janmabhoomi Express: తరచూ జరిగే రైళ్ల ప్రమాదా ఘటనలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రైల్వేశాఖ నిర్లక్ష్యం, లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తాజాగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం జరిగింది.

Janmabhoomi Express: తరచూ జరిగే రైళ్ల ప్రమాదా ఘటనలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రైల్వేశాఖ నిర్లక్ష్యం, లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తాజాగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం జరిగింది.

మన దేశంలోని రవాణ వ్యవస్థల్లో అతిప్రధానమైనది రైల్వే వ్యవస్థ. ఇండియన్ రైల్వే వ్యవస్థ ద్వారా నిత్యం వేలాది మంది  తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అలానే మిగిలిన వాటితో పోలీస్తే.. రైలు జర్నీ కాస్తా తక్కువగా ఉండటంతో అందరూ వీటిపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే తరచూ జరిగే రైళ్ల ప్రమాదా ఘటనలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రైల్వేశాఖ నిర్లక్ష్యం, లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. తాజాగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం జరిగింది. ట్రైన్ స్టార్ట్ అయి కొద్ది దూరంగా వెళ్లగానే రైలుకున్న బోగీలు ఊడిపోయాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వందల ట్రైన్లు నడుస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి లింగపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్. ఈ రైలు రోజూ లింగపల్లిలో ప్రారంభమై..విశాఖపట్నం వెళ్తుంది. లింగపల్లి నుంచి బయలు దేరి.. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు. విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. అదే విధంగా జన్మ భూమి ఎక్స్ ప్రెస్ విశాఖ నుంచి లింగపల్లి కూడా వెళ్తుంది. అలానే  ఈ రోజు విశాఖ నుంచి లింగపల్లి వెళ్తేందుకు ఈ రైలు సిద్ధమైంది. అయితే సాంకేతిక లోపంతో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది.

విశాఖపట్నం నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఆగిపోయింది. విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నుంచి బయలు దేరిన రెండు నిమిషాలకే  గార్డు ఎర్రజెండా ఊపి..ఆపేశాడు. ఆ రైలులోని ఏసీ బోగీల లింకు తెగిపోవడాని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో రైలును కాసేపు ఆపేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం 6.20కు విశాఖపట్నంలో బయల్దేరాల్సిన రైలు ..ప్రారంభమైన కాసేపటికే ఏసీ బోగీల లింక్ ఉండిపోయింది. వెంటనే అప్రమత్తమైన విశాఖ పట్నం రైల్వే సిబ్బంది.. తిరిగి విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యతో ఏసీకి సంబంధించిన రెండు బోగీలు రైలు నుంచి ఊడిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించి..తిరిగి రైలు ప్రారంభిస్తామని వాళ్లు తెలిపారు.

అయితే ఈ ఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలు కదిలిన ప్రారంభం కాబట్టి సరిపోయింది. అదే రైలు రన్నింగ్ లో ఉండగా ఏసీ బోగీలు ఊడి ఉంటే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసి..బోగీలును తగిలించిన అనంతరం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ నుంచి బయల్దేరింది. గతంలో కూడా మధ్య ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఇంజిన్ లేకుండానే రైలు బోగీలు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Show comments