iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

  • Published Jul 31, 2024 | 10:27 AM Updated Updated Jul 31, 2024 | 10:27 AM

Heavy Rains In Telugu States: దేశంలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.. గత ఇరవై రోజులుగా పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం అస్త వ్యస్తంగా మారిపోయింది.

Heavy Rains In Telugu States: దేశంలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి.. గత ఇరవై రోజులుగా పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలతో ప్రజా జీవనం అస్త వ్యస్తంగా మారిపోయింది.

  • Published Jul 31, 2024 | 10:27 AMUpdated Jul 31, 2024 | 10:27 AM
తెలుగు రాష్ట్రాల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

గత పదిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు పడుతున్నాయి. ఒకటీ రెండు రోజులు కాస్త విరామం ఇచ్చినా మళ్లీ నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పులు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుగున్నాయి.పలు కాల్వలకు గండి పడి గ్రామాలు జిలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ వర్షం ముప్పు ఇంకా పోలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ధికారులు కీలక సమాచారం అందించారు. అల్పపీడన ప్రభావంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందని తెలిపారు. వివరాల్లోకి వెళితే..

అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆసీఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్,మహబూబాబాబ్, భూపాల్ పల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే నారాయణపేట్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నాగర్ కర్నూల్ లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఉదయం వేడిగా ఉంటూ.. సాయంత్రానికి చిరు జల్లులు కురుస్తాయన్నారు. ఆగస్టు 2 వరకు ఇలాంటి వాతవరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Yellow alert for these districts

ఉత్తర్ చత్తీస్‌గఢ్ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని.. ఇది నైరుతీ దిశగా సాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర కోస్తా, యానాం లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలోనూ మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, అనంతపురం,అన్నమయ్య, తిరుపతి జాల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.