iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు!

  • Published Jul 18, 2024 | 10:13 AM Updated Updated Jul 18, 2024 | 10:20 AM

Heavy Rains in Telugu States: ఈ ఏడాది జూన్ చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావం తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

Heavy Rains in Telugu States: ఈ ఏడాది జూన్ చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావం తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

  • Published Jul 18, 2024 | 10:13 AMUpdated Jul 18, 2024 | 10:20 AM
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు!

ఈ ఏడాది ఎండలు ఎంతగా మండిపోయాయో.. అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఉన్న అల్పపీడనం బుధవారం నాటికి బలహీనపడింది. మరోవైపు పవ్చిమ మద్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంటుందని తెలిపారు. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పడి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, సూర్యపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సూర్యపేట జిల్లాల్లో భీరీ వరర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

ఇదిలా ఉంటే కోస్తాంద్రలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19 న మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో రాయలసీమలో తెలికపాటి వర్షాలు పడే ఛాన్సు ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.