Rains in AP, TG: ఏపీ, తెలంగాణలకు మరో వర్ష సూచన.. ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్!

Heavy Rains in AP and Telangana: గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షం వదలడం లేదు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

Heavy Rains in AP and Telangana: గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షం వదలడం లేదు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

దేశంలో ప్రస్తుతం రుతు పవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య వాతావరణ పరిస్థితుల్లో తరుచూ మార్పులు వస్తున్నాయి. ఉదయం విపరీతమైన ఎండ కొడుతుంది.. దీంతో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. సాయంత్రం వేళ భారీగా వర్షం పడుతుంది.తెలంగాణాలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చారు. మరో ఐదు రోజుల పాటు వర్షం కురుస్తుందని తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వీడటం లేదు.. గత కొద్దిరోజులుగా రాష్ట్రాంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొన్న హైదరాబాద్ లో పడిన వర్షానికి కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి..వాహనాలతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. తాజాగా వాతావరణ శాఖ అధికారులు మరోసారి తెలుగు రాష్ట్రాలకు కీలక అప్డేట్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం పరిధిలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైన ఉందని తెలిపారు. వాయుగుండం నేడు తెల్లవారుజామున పూరీ, చిలుకా లేక మధ్య ఉన్న తీరాన్ని దాటిందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలపై పడి వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్ని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, నెల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యాసాయి, జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కరుస్తాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

Show comments