AP వెదర్ రిపోర్ట్.. ఆ జిల్లాలకు హెచ్చరిక! పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

AP వెదర్ రిపోర్ట్.. ఆ జిల్లాలకు హెచ్చరిక! పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి రాబోతున్నాయి. దాంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నైరుతి రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ, కోస్తా ప్రాంతాలతో పాటుగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతాంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. అదీకాక పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతంకి ఆనుకుని దక్షిణకోస్తా -ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందన్నారు. ఈ ప్రభావంతో.. నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపూరం మన్యం, విజయనగరం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మంగళవారం పిడుగులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. విజయనగరం, అల్లూరిసీతారామరాజు, తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Show comments