ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదలు రావడంతో.. జనజీవనం స్తంభించడమే కాక తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి తెలంగాణ, ఏపీ. ఈ క్రమంలోనే ఏపీకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అప్పపీడనం బలపడి మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. దీంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. అయితే ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపకున్నా.. 24 గంటల్లో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. రానున్న 24 గంటల్లో ఏపీలో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇక ఉత్తరకోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడం కారణంగా ఇప్పటికే మంగళవారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలోనే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారింది. కాగా.. అది వెంటనే తీవ్ర వాయుగుండంగా బలపడి మధ్యాహ్నం బంగ్లాదేశ్ తీరం దాటింది. దీంతో పశ్చిమ బెంగాల్ మీదుగా బుధవారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
అయితే ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోయినా.. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకులం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. కాగా.. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇదికూడా చదవండి: త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా తెలుగు చిత్ర పరిశ్రమకు అంబటి రాంబాబు వార్నింగ్!