iDreamPost

త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా తెలుగు చిత్ర పరిశ్రమకు అంబటి రాంబాబు వార్నింగ్!

  • Author singhj Published - 09:12 PM, Tue - 1 August 23
  • Author singhj Published - 09:12 PM, Tue - 1 August 23
త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా తెలుగు చిత్ర పరిశ్రమకు అంబటి రాంబాబు వార్నింగ్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై ఆంధ్రప్రదేశ్​ మంత్రి అంబటి రాంబాబు మరోమారు ఫైర్ అయ్యారు. పవన్ నటించిన కొత్త చిత్రం ‘బ్రో’పై ఆయన సీరియస్ అయ్యారు. తన శత్రువులను తిట్టాలనుకునే క్రమంలోనే పవన్ ‘బ్రో’ సినిమాను తీశారని.. అందుకే ఆ మూవీ ఫ్లాప్ అయిందన్నారు అంబటి. తన దగ్గర ఉన్న బ్లాక్​మనీని వైట్​మనీగా మార్చే కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ నుంచి సినిమాలు వస్తున్నాయని.. ‘బ్రో’ చిత్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారాయన. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో అంబటి రాంబాబు మాట్లాడారు.

‘బ్రో’ చిత్రం వసూళ్లు రోజురోజుకీ దారుణంగా పడిపోతున్నాయని అంబటి రాంబాబు అన్నారు. కనీసం పవన్ కల్యాణ్​కు ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే వివాదాల ద్వారా కాసులు రాల్చుకునేందుకు కక్కుర్తి పడుతున్నారని అంబటి పేర్కొన్నారు. వసూళ్లను పెంచుకునే క్రమంలో సినిమా అద్భుతమంటూ చెబుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. పవన్​ ‘బ్రో’ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఎన్నారై అని చెప్పుకొచ్చిన అంబటి.. అమెరికా నుంచి పవన్​కు వస్తున్న డబ్బులు పెద్ద స్కామ్ అని ఆరోపించారు.

పవన్ కల్యాణ్​కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్ ద్వారా అందిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తన సినిమాలకు బ్లాక్ మనీని వాడుతున్నారా అని పవన్​ను ఆయన నిలదీశారు. ఇప్పటిదాకా ఎంత డబ్బు తీసుకున్నారని.. ‘బ్రో’ మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అని ప్రశ్నించారు. అదే టైమ్​లో ఈ సినిమాకు మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్​ మీదా ఆయన సీరియస్ అయ్యారు. ‘ఈ చిత్రంలో శ్యాంబాబుకు బదులు రాంబాబు అని పెట్టుకున్నా నేనేమీ అనేవాడ్ని కాదు. నా డ్యాన్స్ సింక్ కాలేదని అంటున్నారు. నేనేమీ డ్యాన్స్ మాస్టర్​ను కాదు. ఈ విమర్శల్ని ప్రజలు గమనించాలి. త్రివిక్రమ్ సహా టాలీవుడ్​లో ఉన్న నటులు, దర్శకులు, నిర్మాతలు మళ్లీ ఇలాంటి సీన్స్ రిపీట్ చేస్తే గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’ అని అంబటి హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి