Srisailam News: శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు!

శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు!

Srisailam News: శనివారం శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీకెండ్ కావడంతో నల్లమల్ల అటవి మార్గాంలో వాహనల రద్దీ బాగా పెరిగింది. ఈ క్రమలో శ్రీశైలంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Srisailam News: శనివారం శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీకెండ్ కావడంతో నల్లమల్ల అటవి మార్గాంలో వాహనల రద్దీ బాగా పెరిగింది. ఈ క్రమలో శ్రీశైలంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. దేశంలోని నలుమూలల నుంచి మల్లన్నను దర్శించుకనేందుకు భక్తులు వస్తుంటారు. అదే సమయలో నల్లమల అడవుల అందాలను చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు శ్రీశైలం డ్యామ్ నిండు కుండాలో మారింది.  దీంతో డ్యామ్ నుంచి నీటిని దిగువరకు విడుదల చేస్తున్నారు. ఈ అందాలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీశైలం ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు బారులు తీరాయి. వివరాల్లోకి వెళ్తే…

శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక గత మూడు రోజుల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు శ్రీశైలంకి క్యూ కడుతున్నారు. ఇక నేడు, రేపు వీకెండ్ డేస్ కావడంతో శ్రీశైలంలో రద్దీ అమాంతం పెరిగింది. సహజంగానే వారంతపు రోజుల్లో శ్రీశైలం మహా పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులు రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనికి తోడు డ్యాం దగ్గర గేట్లు ఎత్తటంతో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎక్కడపడితే అక్కడ తమ వాహనాలు ఆపేశారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు కారు, బస్సులు నిలిచిపోయాయి.

ఇక వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు భారీగా వస్తున్న వెహికల్స్ తో చాలా నిదానంగా ముందుకు కదులుతున్నాయి. డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి దోమల పెంట వరకు ఫుల్ ట్రాఫిక్ నెలకొంది.  అలానే సున్నిపెంట వైపు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తడంతో, ఆ నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యటకుల తాగిడి పెరిగింది. సాధారణంగానే వర్షాకాలంలో నల్లమల్ల అడవుల అందాలను వీక్షించడానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు. అలానే ఈసారిగా పెద్ద సంఖ్యలో టూరిస్టులు శ్రీశైలాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే మెయిన్ రోడ్డు పక్కనే వాహనాలు నిలిపడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శ్రీశైలం పోలీసులు తీవ్రంగా కృషి  చేస్తున్నారు.

Show comments