ఏపీలోని భారీ వర్షాలు.. 8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రల అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రల అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కుండపోతు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో నదులు, చెరవులు, కాలువలు పొంగిపోయితున్నాయి. దీని వలన లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు చేరిపోవడంతో.. జన జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాకుండా.. బలమైన గాలులు కారణంగా పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవటం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది తాజాగా వాతవరణ శాఖ తెలిపింది. దీంతో ఈ వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రల మీద ఉండనుందని పేర్కొంది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రల అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మిగిలిన చోట్ల మాత్రం మోస్తారు వర్షాలు కురుస్తున్నయని వాతవరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. ఏపీలో పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసింది. అయితే ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా , గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆ జిల్లలాలో  ఈరోజు (శనివారం ఆగస్టు 30) రాత్రి 9:30 గంటల దగ్గర నుంచి రేపు ఉదయం 9:30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.

ఇప్పటికే ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల లోతుకు పైగా వాన నీరు రహదారులపై పొంగి పొర్లుతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కేవలం నగరంలోని రోడ్లపైనే కాదు జాతీయ రహదారులపై కూడా వాన నీరు చేరి నదిని తలపిస్తోంది. అలాగే మరోవైపు   బలమైన ఈదురుగాలులు వీస్తుండడంతో మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో పాటు కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు. ఇకపోతే శనివారం అర్ధరాత్రి విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Show comments