iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆవర్తనం.. 15 వరకు భారీ వర్షాలు!

  • Published Aug 13, 2024 | 10:41 AM Updated Updated Aug 13, 2024 | 10:41 AM

Heavy Rains in Telugu States:గత నెల రోజులుగా ఒకటీ రెండు రోజులు తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తునే ఉన్నాయి. రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి.. మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Heavy Rains in Telugu States:గత నెల రోజులుగా ఒకటీ రెండు రోజులు తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తునే ఉన్నాయి. రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి.. మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Published Aug 13, 2024 | 10:41 AMUpdated Aug 13, 2024 | 10:41 AM
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆవర్తనం.. 15 వరకు భారీ వర్షాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల మరో రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జలాశయాలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.ఒకటీ రెండు రోజులు తప్ప ఏపీ, తెలంగాణలో వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవించాయి. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంది. మంగళవారం ఉదయం నగరంలో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి.. పలు చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూల్, ఆఫీసులకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఫిలిం నగర్, మాదాపూర్, షేక్ పేట్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం వరకు నగరంలో వర్షాలు కురుస్తాయని.. వాతావరణం మేఘావృమై ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు సంగారెడ్ది, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరిలో వర్షలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఊదరు గాలులు, ఉముములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో మెస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అత్యవసర పనులైతే బయటకు వెళ్లాలని సూచించింది.