అలర్ట్: మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు! ఇక 2 రోజుల పాటు తగ్గేదేలే!

Heavy Rains In AP and Telangana States Said Department of Meteorology: గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రేక్ పడింది. అయితే తగ్గుముఖం పట్టిన వర్షాలు మరలా మొదలవుతాయని.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖలు అలర్ట్ ప్రకటించాయి.

Heavy Rains In AP and Telangana States Said Department of Meteorology: గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రేక్ పడింది. అయితే తగ్గుముఖం పట్టిన వర్షాలు మరలా మొదలవుతాయని.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖలు అలర్ట్ ప్రకటించాయి.

భారీ వర్షాలు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. దీని వల్ల నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మోకాళ్ళ లోతులో నీళ్లు చేరుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో అయితే ప్రస్తుతం వాతావరణం కూల్ గా ఉంది. వర్షాలు పడడం లేదు. కానీ మరలా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరించాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు మునుగుతున్నాయి. 

ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. ఋతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకూ విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఏపీలో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జోరు వానలు మొదలయ్యాయి. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని.. ఏపీలో 50 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదల భయం నెలకొంది. రిజర్వాయర్లలోకి వరద నీరు చేరడంతో వేల ఎకరాలు పంట పొలాలు నీట మునిగినట్లు తెలుస్తుంది. ఇటు తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు భారీ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

Show comments