iDreamPost

విస్తరిస్తున్న ‘నైరుతి’తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు..!

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు మీకోసం

Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు మీకోసం

విస్తరిస్తున్న ‘నైరుతి’తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు..!

తెలుగు రాష్ట్రాల్లో మే చివరి వారం నుంచి వాతావరణంలో పలు మార్పులు నెలకొన్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు దంచికొట్టాయి.. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. న్ని రోజులు ఎండ వేడితో తల్లడిల్లిన ప్రజలకు జూన్ నెలలో కాస్త ఊరట లభించింది. ఈ ఏడాది నైరుతి రుగుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. దీని ప్రభావంతో జూన్ నెల ప్రారంభం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.. దీంతొ వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలోనే ఐఎండీ అధికారులు తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన చేశారు.. ఏపీ, తెలంగాణలో శనివారం (జూన్ 8) నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతు పవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కీలక ప్రకటన చేసింది. శనివారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఉత్తర రాయలసీమతో పాటు పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరిత ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో కొనసాగున్నట్లు ఐఎండీ పేర్కొంది.

నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతిపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణ, పట్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని.. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. నేటి నుంచి ఆదిలాబాద్, మంచిర్యాలు, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణ పేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి