iDreamPost
android-app
ios-app

విజయవాడ నుంచి Hyderabad వెళ్లాలనుకునే వారికి అలర్ట్.. ఆ రూట్లు బంద్

  • Published Sep 02, 2024 | 7:50 AM Updated Updated Sep 02, 2024 | 7:50 AM

Heavy Rains-Vijayawada To Hyd Traffic Diverted: విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారా.. అయిత మీకోసమే ఈ అలర్ట్.. ఆ రూట్లలో రాకపోకలు నిషేధించారు అధికారులు. ఆ వివరాలు..

Heavy Rains-Vijayawada To Hyd Traffic Diverted: విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారా.. అయిత మీకోసమే ఈ అలర్ట్.. ఆ రూట్లలో రాకపోకలు నిషేధించారు అధికారులు. ఆ వివరాలు..

  • Published Sep 02, 2024 | 7:50 AMUpdated Sep 02, 2024 | 7:50 AM
విజయవాడ నుంచి Hyderabad వెళ్లాలనుకునే వారికి అలర్ట్.. ఆ రూట్లు బంద్

గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు జలమయం అయ్యాయి. ఎక్కడ చూడు వరద నీరు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. జనజీవనం స్థంభించిపోయింది. ఇక విజయవాడలో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. బెజవాడ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. ఎటు చూసినా నాలుగైదు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. నిత్యం వెళ్లే రూట్లను మూసివేశారు. అత్యవసరం అనుకునే వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ వివరాాాాాలు..

భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర ఉన్న జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే చిల్లకల్లు, నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు వచ్చాయి. పాలేరు నది పొంగడం, సూర్యాపేట తర్వాత రామాపురం క్రాస్‌రోడ్డు బ్రిడ్జి కూలడంతో.. ఈ రూట్లలో రాకపోకలను నిషేధించారు. ఈ మార్గాల్లో ప్రయాణాలు చేయాలనుకునే వారు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు అధికారులు.

VJD to HYD Route closed

వారి కోసం ప్రత్యామ్నయ మార్గాలు..

ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఖమ్మం వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లొచ్చని అధికారులు సూచించారు. అలానే సాయం కోసం హెల్ప్‌లైన్‌ 90102 03626 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మోకాళ్ళ లోతు వరకు వరద వస్తుండటంతో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే మీదకు వాహనాలు రాకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అంతేకాక హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా.. విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా దగ్గర వాహనాలను నిలిపివేశారు. దాంతో హైవే పూర్తిగా స్తంభించిపోగా.. వరద తగ్గేవరకు హైవేపైకి  ప్రయాణికులు ఎవరినీ అనుమతించేది లేదని నందిగామ ఆర్డీవో తెలిపారు.

VJD to HYD Route closed1

అలానే కోదాడ నుంచి దిగువకు భారీగా వరద నీరు వస్తుండటంతో.. నల్లబండగూడెం దగ్గర నేషనల్ హైవే మీదకు నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను అద్దంకి-నార్కట్‌పల్లి వైపు మళ్లించారు అధికారులు. వర్షాలు తగ్గుముఖం పట్టి, వరదలు కాస్త తగ్గిన తర్వాత మళ్లీ పరిస్థితిని సమీక్షించుకున్న తర్వాతనే విజయవాడ-హైదరాబాద్ హైవేపైకి వాహనాలు అనుమతిస్తామంటున్నారు అధికారులు. ప్రజలు ఈ విషయాలను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాక సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. అత్యవసరం అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని.. కానీ ఆ రూట్లలో కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.