Arjun Suravaram
Vijayawada Doctor Family: విజయవాడలో డాక్టర్ శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య, తల్లి సహా ఇద్దరు పిల్లల్ని హత్య చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో వెలుగులోకి కొన్ని విషయాలు వచ్చాయి.
Vijayawada Doctor Family: విజయవాడలో డాక్టర్ శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య, తల్లి సహా ఇద్దరు పిల్లల్ని హత్య చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో వెలుగులోకి కొన్ని విషయాలు వచ్చాయి.
Arjun Suravaram
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఓ వైద్యుడి కుటుంబంలో దారుణం జరిగింది. ఆర్థోపెడిక్ సర్జన్ ధారవత్ శ్రీనివాస్, కుటుంబ సభ్యులను చంపి.. ఆయన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అంతేకాక అలా కుటుంబ సభ్యులను గొంతు కోసి చంపి..తాను ఆత్మహత్య చేసుకోవడంతో అందరి హృదయాలు బరువెక్కాయి. వైద్యుడైన శ్రీనివాస్.. ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు జరిగిని కదా ఏమిటి?, ఆర్థిక సమస్యలా, లేకా మరేమైనా ఇతర వ్యక్తిగత కుటుంబ సమస్యలా?. అసలు డాక్టర్ శ్రీనివాస్ పూర్తి స్టోరీ ఇప్పుడు చూద్దాం..
బెజవాడ నగరంలోని గురు నానక్ కాలనీలోని మారుతి కో ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబర్ 53లోని భవనంలో వైద్యుడు శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఆర్థోపెడిక్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. తల్లి రమణమ్మ (65), భార్య ఉష (38), కూతురు శైలజ (11), కుమారుడు శ్రీహాన్( 6)తో కలిసి శ్రీనివాస జీవిస్తున్నాడు. ఆయన తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. కొంతకాలం క్రితం ఆయన మరణించారు. ఇక శ్రీనివాస్ అన్నయ్య దుర్గా ప్రసాద్ హైదరాబాద్‌లో లాయర్ గా పని చేస్తున్నారు. వీరికి ఓ చెల్లి ఉండగా ఆమెకు వివాహం అయ్యింది.
ఇక 1996లో శ్రీనివాస్ వైద్య విద్యను గుంటూరులో పూర్తి చేశారు. అనంతరం విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో పని చేశారు. ఇక శ్రీనివాస్ కి సొంతంగా ఆస్పత్రిని నడపాలనే కోరిక ఎప్పటి నుంచి ఉండేది. అలా ఎంతో కాలం పాటు ఆ కోరిక నేరవేర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకుని, శ్రీజ ఆర్థోపెడిక్ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించాడు. అందులో పరికరాల కోసం కొంత మంది స్నేహితులను సాయం కోరారు. సుమారు మూడు కోట్లు అప్పులు అయ్యాయని తెలుస్తోంది. హాస్పిటల్ నిర్వహణ కోసం ప్రతి నెల రూ.30లక్షల ఖర్చు అవుతోందని, దానికి తగ్గట్టుగా ఆదాయం లేదని తాను ఆత్మహత్య తప్ప మరో దారి లేదని తరచూ అంటుండే వాడు.
ఇదే సమయంలో ఆస్పత్రి సరిగ్గా నడవకపోవడం, అప్పులు ఇచ్చిన ఫ్రెండ్స్..అందులోని 90 శాతం వాటాను అప్పు కింద సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సొంత ఆస్పత్రి దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు మిత్రుడి ఆర్ధిక ఇబ్బందులు తెలియడంతోనే మిత్రులు ఆస్పత్రిలో భాగస్వామ్యం తీసుకున్నారని, కుటుంబం మొత్తాన్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడతాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిత్రులతో కలవడానికి కూడా ఆసక్తి చూపే వాడు కాదని వాట్సప్ గ్రూపుల్లో చేర్చిన బయటకు వెళ్లిపోయేవాడని బ్యాచ్‌మెట్లు వివరించారు.
తాను చనిపోతే.. తన మీదే ఆధారపడి తన కుటుంబ సభ్యులు బతక లేరని, ఇబ్బంది పడతారని భావించాడు. అందుకే వారిని చంపి.. తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్‌లోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొనుగోలు చేశాడు. మంగళవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న కుటుంబ సభ్యలు మెడ మీద కత్తితో కోసి హత్య చేశాడు. అంతకంటే ముందు వారిని దిండుతో అదిమి చంపి.. ఆ తరువాత కత్తితో కోసినట్లు అక్కడి పరిస్థితులు కనిపించాయి. వారిని చంపిన అనంతరం ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి పత్రాలను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టాడు. తన అన్నకు రాసిన లెటర్‌ను, కారు తాళం చెవిని ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో వేశాడు. అనంతరం తన ఇంటికి వచ్చి..ఆ ప్రాంగణంలోనే ఉరివేసుకున్నారు.
తొమ్మిది గంటల ప్రాంతంలో పనిమనిషి పిలవగా ఇంటి నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఏం జరిగిందని గేటుపై నుంచి చూస్తే వరండాలో శ్రీనివాస్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని, ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని ఆయన స్నేహితుడు భగవాన్. డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి అని, ఇలా కుటుంబాన్ని తాము నమ్మలేకపోతున్నామనన ఆయన తెలిపారు. 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ తో మాకు మంచి అనుబంధం ఉందని, చదువుకునే సమయంలో కూడా ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా వ్యవహరించేవాడని భగవాన్ తెలిపారు. మొత్తంగా కారణంగా ఏదైనాప్పటికి ఓ వ్యక్తి తీసుకున్న క్షణికావేశ నిర్ణయం కారణంగా ఐదు ప్రాణాలు అర్ధాంతరంగా ముగిశాయి.