రేషన్ కార్డు ఉన్న మహిళలకు గుడ్ న్యూస్! డబ్బులు సంపాదించుకునే ఛాన్స్!

తెల్ల రేషన్ కార్డ్ కలిగివున్న మహిళకు తాజాగా అదిరే శుభవార్త అందింది. ఇక పై రేషన్ కార్డ్ ఉంటే ఈజీగా ఉపాధి పొంది పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. అదేలా అంటే..

తెల్ల రేషన్ కార్డ్ కలిగివున్న మహిళకు తాజాగా అదిరే శుభవార్త అందింది. ఇక పై రేషన్ కార్డ్ ఉంటే ఈజీగా ఉపాధి పొంది పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. అదేలా అంటే..

దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, వాటిలో ప్రధానమైనది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు సంక్షేమ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నాయి. పైగా ఇది ప్రజల ఆహార భద్రత, జనాభా నిత్యావసర వస్తువుల పంపిణీని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ రేషన్ కార్డ్ అనేది  దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలకు ఎంతో విలువైనది. దీని ద్వార ఇప్పటికే దేశంలోని ప్రజలు అనేక సంక్షేమ పథకాలకు లబ్ధి పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెల్ల రేషన్ కార్డ్ కలిగివున్న మహిళకు తాజాగా అదిరే శుభవార్త అందింది. ఇక పై రేషన్ కార్డ్ ఉంటే ఈజీగా ఉపాధి పొంది పదిమందికి ఉపాధి కల్పించవచ్చు.  ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుత కాలంలో రేషన్ కార్డ్ లేని వారంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే.. ఈ రేషన్ కార్డ్ వలనే ఆహార అవసరాల దగ్గర నుంచి, సంక్షేమ పథకాల వరకు అన్ని ఆధారపడి ఉన్నాయి. మరి  అటువంటి రేషన్  కార్డ్ వలన ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు అనేక సంక్షేమ పథాకాలను పొందుతున్నారు. అయితే తాజాగా తెల్ల రేషన్ కార్డు కలిగివున్న మహిళలకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఇంతకి అదేమిటంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మహిళలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ శిక్షణ అనేది చంద్రగిరిలో ఈనెల  7వ తేదీ నుంచి ప్రారంభమై 30 రోజుల వరకు ఉచితంగా ఉంటుంది. కాగా, ఇందులో మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ శిక్షణకు తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల నిరుద్యోగ మహిళలు అర్హులు. ఇకపోతే ఈ శిక్షణకు కనీసం విద్యార్హత 10వ తరగతని వెల్లడించారు.

అలాగే శిక్షణ సమయంలో ఉచిత ట్రైనింగ్ తో పాటు భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. కనుక ఆసక్తి కలిగిన వారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు, 4 పాస్పోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించు కోవాలని కోరారు.  ఇక ఇతర వివరాల కొరకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11-48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 94949 51289, 63017 17672 నెంబర్ ల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా శిక్షణ పొందిన అనంతరం సర్టిఫికెట్ కూడా ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే సర్టిఫికెట్ ఉంటే పెద్ద పెద్ద గార్మెన్స్ వంటి పరిశ్రమల్లో ఉపాధి పొందటానికి ఒక చక్కటి మార్గమవుతుందని తెలిపారు. దీనివల్ల స్వయంగా నివాసం ఉన్న చోటే వృత్తి ని కూడా కొనసాగించవచ్చు. మొత్తంగా పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకొంటే అప్పుడు మనం 10 మందికి శిక్షణ కూడా ఇచ్చి, వారికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. మరి, తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు అద్భుతమైన ఉపాధి కల్పించే ఈ అవకాశం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments