సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్! జీవో విడుదల..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నవరత్నాల పేరుతో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఇక విద్యా రంగంలో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చారు సీఎం జగన్. అలానే విద్యార్థులు చదువుకునేందుకు ఎటువంటి ఆటకం కలుగకుండా ఆర్థిక భరోసా కల్పించేలా పలు స్కీమ్ లు ప్రవేశ పెట్టారు. తాజాగా సివిల్స్ సర్వీసెస్ కి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రోత్సాహం అందించేలా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు  జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం  అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వూలను రాష్ట్ర సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఏపీ నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది సివిల్ సర్వీస్ కి ఎంపికయ్యేలా ప్రోత్సహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చాలా మంది సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆర్థికంగా  ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే విజయం సాధించే అవకాశం  ఉన్నా కూడా అవరోధాల కారణంగా మధ్యలో ఆగిపోతుంటారు. అందుకే  అర్హులైన  సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం భావించింది.

అందుకే గతంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో  ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ బిల్లుకు ఆమోదం తెలిపింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆ పథకాన్నికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి  రూ. లక్ష, మెయిన్స్ క్వాలిఫై  అయిన వారికి రూ. 50 వేలు చొప్పున డీబీటీ పద్ధతి నేరుగా వారి ఖాతల్లో జమ చేస్తుంది.  యూపీఎస్సీ అనుమించే ఎన్ని పర్యాయాలు అయినా  ఆ అభ్యర్థులకు  ప్రభుత్వం ఈ  ప్రత్సాహకం అందిస్తుంది.  ఈ ప్రొత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు  తీసుకోవాలని బీసీ, ఎస్సీ,ఎస్టీ  దివ్యాంగుల సంక్షేమ శాకలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Show comments