iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో AP DSC నోటిఫికేషన్!

  • Published Oct 12, 2023 | 8:23 PM Updated Updated Oct 12, 2023 | 8:23 PM
  • Published Oct 12, 2023 | 8:23 PMUpdated Oct 12, 2023 | 8:23 PM
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో AP DSC నోటిఫికేషన్!

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభవార్తను అందించారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో త్వరలో రానున్న ఎన్నికలకు ముందుగానే డీఎస్సీ నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు. మంత్రి చేసిన తాజా ప్రకటనతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే విద్యా శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. యూనివర్శిటీలు, ఐఐటీల్లో ఖాళీగా ఉన్న 3,200కు పైగా పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. దాదాపు 18 ఏళ్లుగా వర్శిటీల్లో శాశ్వత పోస్టుల భర్తీ జరగలేదని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తామన్నారు. ముందు టెట్‌, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని మంత్రి వెల్లడించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş